ఫిఫా వరల్డ్ కప్ 2022లో, ఐదుసార్లు ప్రపంచ కప్ విజేత బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా 4-2తో బ్రెజిల్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు, బ్రెజిల్ ప్రపంచానికి బలమైన పోటీదారుగా పరిగణించారు. క్వార్టర్‌ఫైనల్‌లో బ్రెజిల్ ఓటమి తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో బ్రెజిల్‌పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఫ్యాన్స్ ఓ పిల్లి వీడియోను షేర్ చేస్తూ, ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ పిల్లి వల్ల బ్రెజిల్‌కు శాపం తగిలిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
బ్రెజిల్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో బ్రెజిల్ జట్టు పిల్లితో తప్పుగా ప్రవర్తించింది. బ్రెజిల్ స్టార్ ప్లేయర్ వినిసియస్ జూనియర్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఒక పిల్లి అతని టేబుల్ దగ్గరకు వచ్చింది. ఆ పిల్లిని రెండు చేతులతో ఎత్తుకుని టేబుల్ కింద పడేశాడు. ఈ వీడియోనే బ్రెజిల్ ఓటమికి కారణమని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ పిల్లి వల్ల జట్టు శాపానికి గురైందని ప్రజలు అంటున్నారు.
O gato quis ficar perto do Vini Jr, mas foi impedido. pic.twitter.com/cNboVrme6N
— Ricardo Magatti (@RMagatti) December 7, 2022
వీడియోను షేర్ చేస్తూ, ఒక వినియోగదారు బ్రెజిలియన్ భాషలో ఇలా వ్రాశాడు, “పిల్లి విజయాన్ని ఇవ్వాలని అనుకుంది, కానీ అవమానం జరిగింది” అంటూ రాసుకొచ్చాడు. ఈ పిల్లి బ్రెజిల్‌ను శపించిందని మరొక వినియోగదారు కామెంట్ చేశాడు.
Brazil isn’t winning the damn World Cup pic.twitter.com/EfQ59l8Xxy
— frqazhahßn (@FariqBAzaha) December 8, 2022
కాగా, క్రొయేషియా సెమీఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం. ఈ జట్టు తన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను డిసెంబర్ 14వ తేదీ బుధవారం లియోనెల్ మెస్సీ జట్టు అర్జెంటీనాతో ఆడుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..