Viral Video: పోటీలో పాల్గొనలేదు.. కానీ, అందరి కంటే ముందే గమ్యాన్ని చేరాడు..! వైరలవుతోన్న వీడియో

|

Jul 22, 2021 | 6:54 AM

పరుగు పందెంలో ఎవరు ముందు పరిగెత్తుతారోనని అంతా పోటీలో పాల్గొన్న వారివైపే ఆసక్తిగా చూస్తుంటారు. కానీ, వారందర్నీ కాదని, పరుగు పందెంలోని పోటీ పడని ఓ వ్యక్తిని చూడడం మీరెప్పుడైనా చూశారా? చైనాలో అదే జరిగింది.

Viral Video: పోటీలో పాల్గొనలేదు.. కానీ, అందరి కంటే ముందే గమ్యాన్ని చేరాడు..! వైరలవుతోన్న వీడియో
Viral Video
Follow us on

Viral Video: పరుగు పందెంలో ఎవరు ముందు పరిగెత్తుతారోనని అంతా పోటీలో పాల్గొన్న వారివైపే ఆసక్తిగా చూస్తుంటారు. కానీ, వారందర్నీ కాదని, పరుగు పందెంలోని పోటీ పడని ఓ వ్యక్తిని చూడడం మీరెప్పుడైనా చూశారా? చైనాలో అదే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లోని డాటంగ్‌ యూనివర్సిటీలో 100 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. అయితే పరుగు మొదలు పెట్టేందుకు కౌంట్ స్టార్ట్ చేశారు. అంతా క్రీడాకారులవైపే చూస్తున్నారు. 3, 2, 1 స్టార్ట్ అన్నారు. అంతే పరుగు మొదలైంది. కానీ, ఇక్కడో ట్విట్ట్. షడన్‌గా అందరి చూపు ఓ వ్యక్తిపై పడింది. ఆయన పోటీలో కూడా లేడు. కానీ, పోటీలో పాల్గొన్న వారందరి కంటే స్పీడ్‌గా పరిగెత్తుతూ వెళ్లాడు. ఆయన ఓ కెమెరా మెన్. పోటీలో పాల్గొన్న వారిని వీడియో తీసేందుకు వారి కంటే ముందు పరిగెత్తుతూ వెళ్లాడు. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులంతా ఆయననే చూస్తూ ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. వీడియో తీసేందుకు క్రీడాకారుల కంటే వేగంగా పరిగెత్తాడంట.

ఆ వ్యక్తి అదే కాలేజీలో చదువుతున్నాడంట. మరోవైపు వీడియోగ్రాఫర్‌గాను పనిచేస్తున్నాడంట. ఇందులో భాగంగానే క్రీడాపోటీల వీడియోని తీసేందుకు వచ్చాడు. దూరం నుంచి మొత్తం పోటీని వీడియో తీస్తారు. కానీ, ఈయన ఏకంగా నాలుగు కిలోల కెమేరాతో ఆటగాళ్ల కంటే ముందుగా పరుగెత్తి వీడియో తీశాడు. అయితే, మిగతా కెమెరామెన్లు మాత్రం మనోడి పరుగును వీడియో తీశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందరి కంటే ముందుగా పరిగెత్తి గమ్యాన్ని కూడా ఈ కెమెరామెన్ చేరుకున్నాడు.

Also Read:

Viral Video: మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రేయసి..! నెట్టింట్లో ఆకట్టుకుంటోన్న జిల్, ఫిల్ వీడియో

Tokyo Olympics 2021: దారులన్నీ అటువైపే.. కసితో పడుతున్న అడుగులు.. పతకాల కోసం పరుగులు..