Denmark Open: డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్‎లో విజయం సాధించిన పీవీ సింధు.. శుభారంభం చేసిన శ్రీకాంత్..

|

Oct 20, 2021 | 9:52 AM

డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‎లో స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేశారు. యిగిట్‌ టర్కీకి చెందిన నెస్లిహాన్‎పై విజయం సాధించి ఫ్రిక్యార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు...

Denmark Open: డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్‎లో విజయం సాధించిన పీవీ సింధు.. శుభారంభం చేసిన శ్రీకాంత్..
Sindhu
Follow us on

డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‎లో స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేశారు. యిగిట్‌ టర్కీకి చెందిన నెస్లిహాన్‎పై విజయం సాధించి ఫ్రిక్యార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 30 నిమిషాల పాటి సాగిన గేమ్‎లో యిగిట్‎ను 21-12, 21-10 తేడాతో ఓడించారు. యిగిట్‌పై సింధు సునయాసంగా విజయం సాధించింది. ఇక పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–14, 21–11తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై గెలుపొందారు. సమీర్‌ వర్మ 21–17, 21–14తో థాయిలాండ్‌‎కు చెందిన కున్లావుత్‌ వితిద్‌సర్న్‎ను ఓడించాడు.

వరల్డ్ నంబర్ 14 శ్రీకాంత్ రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 1, టాప్ సీడ్ జపనీస్ కెంటో మొమోటాతో తలపడతాడు. సమీర్ తదుపరి రౌండ్‌లో డెన్మార్క్‎కు చెందిన మూడో సీడ్ అండర్స్ అంటోన్సెన్‌తో తలపడే అవకాశం ఉంది. భారత పురుషుల డబుల్స్‎లో సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి తొలి రౌండ్‎లో ఇంగ్లండ్ జంట కల్లం హెమ్మింగ్, స్టీవెన్ స్టాల్‌వుడ్‌ను 23-21 21-15తో ఓడించారు. MR అర్జున్, ధృవ్ కపిల 21-19 21-15 ఇంగ్లాండ్ చెందిన ప్రపంచ నంబర్ 17 జంటను షాక్ ఇచ్చారు. అత్రి, బి సుమీత్ రెడ్డి 18-21 11-21తో మలేషియాకు చెందిన గోహ్ స్జీ ఫెయి, ఇజుద్దీన్ చేతిలో ఓడిపోయారు. టోక్యో

Read Also.. T20 World Cup: అతడితో రెండు, మూడు రోజులు సరదాగా గడిపాము.. అతని రాక ఎంతో సంతోషాన్ని ఇచ్చింది..