కొలంబియన్ ఫస్ట్ డివిజన్ ఫుట్‌బాల్ లీగ్‌లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన క్రీడాభిమానులకు షాక్ ఇచ్చింది. శాంటా ఫే డిఫెండర్ గీసన్ పెరియా సోమవారం జరిగిన మ్యాచ్‌లో తన ప్రత్యర్థిని దృష్టి మరల్చడానికి నీచమైన పని చేశాడు. అయితే, ఈ విషయాన్ని మ్యాచ్ అధికారులు గమనించకపోవడంతో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ, ఈ నీచమైన పని కెమెరాలకు చిక్కడంతో ప్రస్తుతం అతనిపై వేటు పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రత్యర్ధుల వ్యూహాలను మార్చేందుకు ఇలాంటి విచిత్రమైన పనిని తన గేమ్ ప్లాన్‌లా మార్చుకున్నాడు. 31 ఏళ్ల పెరియా ఫ్రీకిక్ టేకర్‌కు ఆటంకం కలిగించేలా ఫ్రీకిక్ వాల్‌లో నిలబడి తన షార్ట్‌ను కిందకు లాగి రచ్చ చేశాడు.
మ్యాచ్ సమయంలో, రిఫరీ ఆట నాల్గవ నిమిషంలో ఆతిథ్య జట్టుకు ఫ్రీకిక్‌ను అందించాడు. శాంటా ఫే రక్షణ గోడను ఏర్పరచడానికి దారితీసింది. ఇందులో పెరియా అతని సహచరుడు, మాజీ ఆస్టన్ విల్లా, వెస్ట్ హామ్, వాట్‌ఫోర్డ్ మిడ్‌ఫీల్డర్ కార్లోస్ సాంచెజ్, హెరాల్డ్ రివెరాతో ఉన్నారు. స్పాట్ కిక్ టేకర్ దృష్టి మరల్చడానికి పెరియా తన షార్ట్‌ను కిందకి లాగి, తన ప్రైవేట్ పార్ట్‌ని చూపించాడు.
అయితే, మైదానంలో అతని చేష్టలను మ్యాచ్ అధికారులు గమనించలేకపోయారు. దీంతో జరిమానా నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆ క్షణం మాత్రం కెమెరాలో రికార్డైంది.
సోమవారం కొలంబియన్ లీగ్‌లో శాంటా ఫే జాగ్వార్స్‌కు స్వదేశీ జట్టుగా బరిలోకి దిగింది. జాగ్వార్స్ 2-1తో ఆ టీంను ఓడించింది. జువాన్ కామిలో అరిస్టాజాబల్ గోమెజ్‌కి రెడ్ కార్డ్ కారణంగా శాంటా ఫే 10 మందిని తగ్గించిన తర్వాత పాబ్లో రోజాస్ స్టాపేజ్ టైమ్‌లో స్కోర్ చేశాడు.
గీసన్ పెరియా, అతని క్లబ్.. కొలంబియన్ FA ఈ విచిత్రమైన ఫ్రీ-కిక్ సంఘటనపై ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, గీసన్ పెరియా ప్రవర్తనపై శిక్షను ఎదుర్కోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.