పల్లెటూరి కబడ్డీ.. ప్రపంచ స్థాయి మార్కెట్‌గా ఎలా ఎదిగింది ? ద జర్నీ ఆఫ్ కబడ్డీ

మన దేశవాళీ క్రీడ కబడ్డీ దేశంలోని పలు రాష్ట్ర్లాలకు చెందిన గ్రామీణ యువతకు జీవనోపాధిగా మారి ఎందరికో కడుపు నింపుతోంది. పల్లెటూరి పిల్లలు సరదాగా ఆడుకున్న కబడ్డీ నేడు కొన్ని వర్గాలకు కాసుల పంటగా మారి సిరులు కుమ్మరిస్తోంది. IPL టైటిల్ స్పాన్సర్‌షిప్ తర్వాత భారతదేశంలో ఇదే రెండవ అత్యధిక స్పాన్సర్‌షిప్ ఒప్పందంగా నిలిచింది. ఇక అంతటితో కబడ్డీ కూత ఆగలేదు.. గుక్కతిప్పకుండా వేలం జోరు పుంజుకుంటూ వచ్చింది.

పల్లెటూరి కబడ్డీ..  ప్రపంచ స్థాయి మార్కెట్‌గా ఎలా ఎదిగింది ? ద జర్నీ ఆఫ్ కబడ్డీ
pro kabaddi league

Edited By: TV9 Telugu

Updated on: Jul 30, 2024 | 12:09 PM

pro kabaddi league.. క్రికెట్‌ తప్ప వేరే ఆట తెలియదన్నట్లుగా వ్యవహరించే మన దేశంలో సంచలనాలు సృష్టిస్తున్న గేమ్‌ కబడ్డీ లీగ్‌. ఒక గ్రామీణ క్రీడకు కమర్షియల్‌ హంగులు అద్ది.. ఆ ప్లేయర్స్‌ను కూడా కోటీశ్వరులను చేస్తోంది. మంచి యాక్షన్‌, డ్రామా, థ్రిల్లింగ్‌ మూవ్‌మెంట్స్‌తో క్రీడా ప్రపంచంలో కబడ్డీ మార్మోగిపోతోంది. రూరల్‌ ఇండియాలోనే కాదు.. అర్బన్‌ స్పోర్ట్స్‌ లవర్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. 31కి పైగా దేశాల్లో ఆడుతున్న ఐపీఎల్‌ తర్వాత అత్యధిక మంది చూసే లీగ్‌గా పీకేఎల్‌ ఎదిగింది. ఇప్పటికే 10 సీజన్లు పూర్తి చేసుకొని 11వ సీజన్‌కు సిద్ధమవుతున్న ఈ పీకేఎల్‌.. ప్రతి సీజన్‌కూ తన బ్రాండ్‌ వాల్యూను పెంచుకుంటూ వెళ్తోంది. 2014లో తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్‌ ప్లేయర్స్‌ వేలం జరిగింది. అప్పటి వరకూ క్రికెట్‌లో ఐపీఎల్‌ ప్లేయర్స్‌ వేలం చూసిన అభిమానులను ఈ కబడ్డీ వేలం పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఐపీఎల్‌లో స్టార్ క్రికెటర్లను కోట్లు పెట్టి కొన్నాయి ఫ్రాంచైజీలు. అదే కబడ్డీ లీగ్‌ తొలి సీజన్‌లో ఓ ప్లేయర్‌ పలికిన అత్యధిక మొత్తం ఎంతో తెలుసా? కేవలం రూ. 12.8 లక్షలు. ఈ మొత్తమే అప్పట్లో కబడ్డీ ప్లేయర్స్‌కు చాలా ఎక్కువ. అప్పటి ఇండియన్‌ కబడ్డీ టీమ్‌ కెప్టెన్‌ రాకేశ్‌ కుమార్‌ ఈ ధర పలికాడు. కానీ, ప్రస్తుతం కబడ్డీ వేలం కోట్లలోకి చేరింది. PKL 10 వేలంలో మొత్తం ముగ్గురు రైడర్లు మిలియనీర్లు అయ్యారు. ఒక్కో ఆటగాడికి...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి