Brazil Vs Argentina: బ్రెజిల్, అర్జెంటీనా మధ్య ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత గ్రౌండ్‌లోకి పోలీసులు, ఆరోగ్య కార్యకర్తల బృందం రంగప్రవేశం చేశారు. నలుగురు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా అందరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన వల్ల మ్యాచ్ కూడా రద్దు చేయాల్సి వచ్చింది. అయితే అదుపులోకి తీసుకున్న నలుగురు ఆటగాళ్లు అర్జెంటీనాకు చెందినవారు. వారి పేర్లు మార్టినెజ్, జియోవన్నీ, రొమెరో, బుయెండియా. వీరు కరోనా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ మ్యాచ్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్. దీనికి ముందు నలుగురు అర్జెంటీనా ఆటగాళ్లను బ్రెజిల్ ఆరోగ్య శాఖ10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని కోరింది. కానీ వీరు కరోనా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి నేరుగా ఇంగ్లాండ్ నుంచి బ్రెజిల్‌కు వెళ్లి ప్రీమియర్ లీగ్‌లో ఆడారు. అయితే లైవ్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి ఆరోగ్య కార్యకర్తలు, పోలీసుల బృందం వెళ్లి నలుగురు ఆటగాళ్లను గుర్తించారు. దీనివల్ల మ్యాచ్ కూడా రద్దు చేశారు. అయితే మ్యాచ్ రద్దయిన తర్వాత బ్రెజిల్,అర్జెంటీనా ఆటగాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపించింది. మెస్సీ, నేమార్ కూడా మాట్లాడుకున్నారు. మ్యాచ్ రద్దు అయినపుడు స్కోరు 0-0తో సమానంగా ఉంది.
అయితే ఈ విషయంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాళ్లు ఇలా చేయడం పద్దతి కాదని మాజీలు విమర్శిస్తున్నారు. ఒకవైపు కరోనా వల్ల చాలామంది మృత్యవాత పడుతుంటే ఆటగాళ్లు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. కచ్చితంగా క్వారంటైన్ నిబంధనలు, ప్రోటోకాల్స్ పాటించాలని సూచించారు. అలా చేయని ఆటగాళ్లపై నిషేధం విధించాలని హెచ్చరించారు.
?⚽️ | NEW: Footage shows Brazilian officials entering the pitch during the Brazil vs Argentina game to allegedly detain 4 Argentinian players who had entered the country from England pic.twitter.com/3X0PkNghmN
— Football For All (@FootballlForAll) September 5, 2021