FIFA WC 2022 Final: ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ (ఆదివారం)18 న అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ మధ్య జరగనుంది. తన చివరి ప్రపంచ కప్ ఆడుతున్న మెస్సీకి టైటిల్ గెలుచుకునే గొప్ప అవకాశం ఉంటుంది. అయితే, ఫ్రెంచ్ జట్టుకు సంతోషం కలిగించే ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు తమ కెప్టెన్ లియోనెల్ మెస్సీ పూర్తిగా ఫిట్‌గా లేడని అర్జెంటీనా శిబిరం నుంచి పెద్ద వార్త వస్తోంది. మెస్సీ ఫిట్‌నెస్‌పై అర్జెంటీనా అభిమానుల ఆందోళన మరింతగా పెరిగింది.
మెస్సీ స్నాయువు గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు. క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా మెస్సీ కాస్త అసౌకర్యంగా కనిపించినా, మ్యాచ్‌లో పాల్గొన్నాడు. టోర్నీ ప్రారంభం కాకముందే, మెస్సీ ఫిట్‌నెస్ గురించి అర్జెంటీనా అభిమానులకు ఆందోళన కలిగించింది. కానీ అతను ఇప్పటివరకు ప్రతి మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఒక్కదానిలో కూడా గాయం కారణంగా బెంచ్‌లో కూర్చోలేదు.
ఈసారి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడానికి ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా రెండూ బలమైన పోటీదారులుగా పేరుగాంచారు. అందుకే ఇరుజట్లు ఫైనల్స్‌లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నారు. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఫ్రాన్స్ ఉవ్విళ్లూరుతుండగా, అర్జెంటీనా జట్టు టైటిల్‌తో తమ స్టార్ ప్లేయర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని కోరుతోంది. రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో విజేతను ఎంచుకోవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏ జట్టు ఏ విషయంలోనూ ఇతర జట్టు కంటే బలహీనంగా కనిపించడం లేదు. ఫ్రెంచ్ జట్టు చాలా అటాకింగ్ ఫుట్‌బాల్ ఆడుతుంది. అర్జెంటీనా ఆట కూడా అటాకింగ్‌తో దూసుకపోతోంది. కాబట్టి చాలా ఉత్కంఠగా మ్యాచ్ సాగనుందని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..