Abhinav Bindra: 13 ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో ఇదే రోజున ఓ అద్భుతం జరిగింది. ఆగస్టు 11, 2008న ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుడు ఓ ఘనత సాధించాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో పాల్గొని భారతదేశానికి బంగారు పతకాన్ని అందించాడు. దీంతో బంగారు పతకం గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచి, ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. అతనెవరో తెలుసా.. అభినవ్ బింద్రా. బీజింగ్‌లో 2008లో జరిగిన ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించి పలు రికార్డుల నెలకొల్పాడు. 10మీటర్ల రైఫిల్ షూటింగ్ ఈవెంట్‌లో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. తన చివరి షాట్‌లో 10.8 సాధించి భారత దేశానికి గోల్డ్ అందించాడు.
దీనికి ముందు ఫిన్లాండ్ షూటర్ మెన్నీ హక్కినెస్‌తో టై అయింది. ఇద్దరూ సమంగా నిలవడంతో ఫైనల్ షాట్‌పై అందరి ఆసక్తి నెలకొంది. ఎంతో ఒత్తిడిని అధిగమించి బింద్రా ఫైనల్ షాట్‌లో 10.8 సాధించాడు. లేకుంటే స్వర్ణం సాధ్యమయ్యేదికాదు. అనంతరం బింద్రా 2017లో అధికారికంగా షూటింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్‌కు ముందు జరిగిన 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. కానీ, పతకం సాధించలేకపోయాడు. ఆగస్టు 11, 2008 న అభినవ్ బింద్రా ఒలింపిక్ పతకాన్ని సాధిస్తే.. ఆగస్టు 7, 2021 న నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్‌లో స్వర్ణం సాధించి బింద్రాతో సమానంగా నిలిచాడు.
మరోవైపు 2020 టోక్యో ఒలింపిక్స్ ర్యాంకింగ్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఈ క్రీడల్లో భారత్ 7 పతకాలను సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. ఇంతకు ముందు జరిగిన ఒలింపిక్స్‌లో రికార్డులను బ్రేక్ చేసింది. కాగా, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో ఆరో స్థానంలో నిలిచిన భారత్, 2020లో 48వ స్థానంలో నిలిచింది. 1980 తరువాత భారత్‌కి ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్.
టోక్యో ఒలింపిక్స్ పూర్తవ్వడంతో ఒలింపిక్ జెండాని పారిస్ మేయర్ అన్నే హిగాల్డో పారిస్ తీసుకెళ్లారు. 2024లో పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే.
Also Read: IPL 2022: వచ్చే ఏడాది బరిలో మరో రెండు జట్లు.. ముగ్గురు ఆటగాళ్లకే అనుమతి?
IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియా బోల్తా.. విరాట్, పుజారా విఫలం.. తొలిసారి బరిలోకి రోహిత్, పంత్