Neeraj Chopra: ఆకాశ వీధుల్లో బల్లెం వీరుడు.. స్కై డైవింగ్‌తో డేరింగ్‌ స్టంట్‌.. వీడియో వైరల్‌

భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. గాయం కారణంగా కామన్వెల్త్‌కు దూరమైన ఈ జావెలిన్‌ స్టార్‌ డైమండ్‌ లీగ్‌ ట్రోఫిని దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు.

Neeraj Chopra: ఆకాశ వీధుల్లో బల్లెం వీరుడు.. స్కై డైవింగ్‌తో డేరింగ్‌ స్టంట్‌.. వీడియో వైరల్‌
Neeraj Chopra

Updated on: Sep 15, 2022 | 3:11 PM

భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. గాయం కారణంగా కామన్వెల్త్‌కు దూరమైన ఈ జావెలిన్‌ స్టార్‌ డైమండ్‌ లీగ్‌ ట్రోఫిని దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. గత వారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్‌ తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసి డిస్‌క్వాలిఫై అయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో 88.44 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. మూడో ప్రయత్నంలో​ 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు చివరి ప్రయత్నంలో ఏకంగా 87 మీటర్లు విసిరి డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా ఇప్పుడీ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించే పనిలో పడ్డాడు నీరజ్‌. వెకేషన్‌ కోసం స్విట్జర్లాండ్ చేరుకున్న అతను స్కై డైవింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన జావెలిన్‌ స్టార్‌ ‘స్కై ఈజ్‌ నాది ది లిమిట్‌’ అని సరదాగా క్యాప్షన్‌ జోడించాడు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌గా హృతిక్‌ రోషన్‌ నటించిన ‘జిందగీ నా మిలేగీ దొబారా’ సినిమా పాటను జత చేశాడు. కాగా ఈ డేరింగ్‌ స్టంట్‌ చేసే సమయంలో ఎంతో ఉత్సాహంగా కనిపించాడు నీరజ్‌. చిరునవ్వులు చిందిస్తూ ఎంజాయ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఇప్పటివరకు సుమారు 4 లక్షలకు పైగా లైకులు రావడం విశేషం. కాగా ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లో ఉన్న నీరజ్‌ వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో జరిగే వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us