టీమిండియాకు స్పిన్‌ సలహాదారుగా ‘నరేంద్ర హీర్వాణి’!

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్పిన్‌ బౌలింగ్‌లో మరింత మెరుగయ్యేందుకు బీసీసీఐ స్పిన్‌ సలహాదారును నియమించింది. టీమిండియా మాజీ క్రికెటర్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ స్పిన్‌ కోచ్‌ నరేంద్ర హీర్వాణికి బాధ్యతలు అప్పగించింది. ఆయన భారత్‌ తరఫున 17 టెస్టులు, 18 వన్డేలు ఆడారు. సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ నుంచి అందుబాటులో ఉంటారు. ఐతే ఎంపిక చేసిన సిరీస్‌లకు మాత్రమే ఆయన జట్టుతో కలిసి పర్యటిస్తారు. ప్రస్తుతం భారత జట్టులో పూనమ్‌ యాదవ్‌, ఎక్తాబిష్ఠ్‌, దీప్తిశర్మ […]

టీమిండియాకు స్పిన్‌ సలహాదారుగా 'నరేంద్ర హీర్వాణి'!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 19, 2019 | 1:43 AM

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్పిన్‌ బౌలింగ్‌లో మరింత మెరుగయ్యేందుకు బీసీసీఐ స్పిన్‌ సలహాదారును నియమించింది. టీమిండియా మాజీ క్రికెటర్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ స్పిన్‌ కోచ్‌ నరేంద్ర హీర్వాణికి బాధ్యతలు అప్పగించింది. ఆయన భారత్‌ తరఫున 17 టెస్టులు, 18 వన్డేలు ఆడారు. సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ నుంచి అందుబాటులో ఉంటారు. ఐతే ఎంపిక చేసిన సిరీస్‌లకు మాత్రమే ఆయన జట్టుతో కలిసి పర్యటిస్తారు. ప్రస్తుతం భారత జట్టులో పూనమ్‌ యాదవ్‌, ఎక్తాబిష్ఠ్‌, దీప్తిశర్మ వంటి స్పిన్నర్లు ఉన్నారు. తమకొక మంచి స్పిన్‌ కోచ్‌ కావాలని ఈ మధ్యే టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది. ఆమె వినతి మేరకు బీసీసీఐ హీర్వాణిని నియమించింది. పురుషుల జట్టు మాదిరిగానే మహిళలకూ అన్ని విభాగాల్లో ప్రత్యేక సహాయ సిబ్బంది ఉంటారని మరొకరు వెల్లడించారు.