Naman Ojha: క్రికెట్‌కు నమన్‌ ఓజా గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ కన్నీంటి పర్యంతమైన వికెట్ కీపర్..

Naman Ojha announces retirement: భారత సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ నమన్‌ ఓజా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు గుడ్ బై చెబుతూ.. ఓజా సోమవారం నిర్ణయం..

Naman Ojha: క్రికెట్‌కు నమన్‌ ఓజా గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ కన్నీంటి పర్యంతమైన వికెట్ కీపర్..

Updated on: Feb 16, 2021 | 2:39 AM

Naman Ojha announces retirement: భారత సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ నమన్‌ ఓజా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు గుడ్ బై చెబుతూ.. ఓజా సోమవారం నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల ఓజా భారత్‌ తరపున (టెస్ట్, వన్డే, టీ20) మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. నమన్ ఓజా 2010 లో మొట్టమొదటిసారిగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌కు ఎంపికై అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2015లో శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌‌లో ఓజా ఆడాడు. అనంతరం 20 సీజనల్లో దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా ఆడిన ఓజా జాతీయ జట్టులో తిరిగి స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. నమన్ ఓజా 17 ఏళ్ల వయసులో 2000-01లో మధ్యప్రదేశ్‌ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పుడే మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి రావడంతో అతనికి అవకాశాలు రాలేదు. కాగా.. ఐపీఎల్‌లోనూ ఓజా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరపున ఆడాడు.

తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ.. నమన్ ఓజా కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా… సుదీర్ఘకాలం పాటు క్రికెటర్‌గా కొనసాగడం గర్వంగా ఉందని తెలిపాడు. దేశానికి, రాష్ట్రానికి ఆడడం నా కల దాన్ని పూర్తి చేశానని.. తనకు సహకరించిన వారందరికీ, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు ఓజా.

Also Read:

IPL 2021: ప్రాంచైజీ పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..! ఈ సారైనా అద‌ృష్టం కలిసొచ్చేనా..?

క్రికెట్‌లోనే కాదు ఆర్జనలోనూ అగ్రస్థానం.. స్మృతి మందాన ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!!