ధోనీ ఓ లెజెండ్… అతనికి అన్ని విషయాలు తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్

| Edited By:

Jul 21, 2019 | 9:51 PM

ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసిన తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు పలికిన ధోనీ.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ధోనికి వీడ్కోలు సమయం వచ్చేసిందని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వెస్టిండీస్ టూర్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.సెలక్టర్లు ప్రకటించిన జట్లలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ పేరు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్ […]

ధోనీ ఓ లెజెండ్... అతనికి అన్ని విషయాలు తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్
Follow us on

ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసిన తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు పలికిన ధోనీ.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ధోనికి వీడ్కోలు సమయం వచ్చేసిందని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వెస్టిండీస్ టూర్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.సెలక్టర్లు ప్రకటించిన జట్లలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ పేరు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్ వార్తలు మరోమారు తెరపైకి వచ్చాయి.

జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ధోనీ రిటైర్మెంట్ వార్తలపై స్పష్టత ఇచ్చాడు. ధోనీ లాంటి లెజెండ్‌కు ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసన్నాడు. రిటైర్మెంట్ అనేది పూర్తిగా ధోనీ వ్యక్తిగత విషయమన్నాడు. ధోనీ కనుక రిటైర్ అయితే ఏం చేయాలన్న దానిపై చాలా ప్రణాళికలు ఉన్నాయన్న ఎమ్మెస్కే.. అందులో ఒకటి పంత్‌ను తీసుకోవడమన్నాడు. ప్రస్తుతానికి ఇదే తమ ప్లాన్ అని వివరించాడు.