అమెరికా: భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ లియాండర్ పేస్–మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్ 1995లో హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్ జాన్ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్‌జోస్ టోర్నీ) తర్వాత ఏటీపీ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు.