కోల్‌కతా గులాబీమయం..ఎందుకు?

|

Nov 19, 2019 | 2:01 PM

బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత టీం.. రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చెయ్యాలని చూస్తోంది. మొదటి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో రెండు జట్లకు ప్రాక్టీస్ చేసేందుకు విరివిగా సమయం లభించింది.  అయితే ఈ మ్యాచ్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. భారత టీం ఆడబోతున్న తొలి డే అండ్ నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో ఈడెన్‌ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టికెట్లు […]

కోల్‌కతా గులాబీమయం..ఎందుకు?
Follow us on

బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత టీం.. రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చెయ్యాలని చూస్తోంది. మొదటి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో రెండు జట్లకు ప్రాక్టీస్ చేసేందుకు విరివిగా సమయం లభించింది.  అయితే ఈ మ్యాచ్‌కు ఓ స్పెషాలిటీ ఉంది. భారత టీం ఆడబోతున్న తొలి డే అండ్ నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో ఈడెన్‌ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. శుక్రవారం నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌పై.. ఆసక్తి పెంచేందుకు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

రెండు జట్లకు గులాబీ టెస్టులో ఆడిన అనుభవం లేకపోవడంతో ఇప్పటికే ఆటగాళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ మొదలెట్టారు. ఇకపోతే తొలి డే అండ్ నైట్‌ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న కోల్‌కతా పూర్తిగా గులాబీరంగు సంతరించుకుంటోంది. సౌరవ్‌ గంగూలీ ఈ మ్యాచ్‌ కోసం పింకూ-టింకూ అనే మస్కట్‌ను ఆవిష్కరించాడు. ఓ భారీ పింక్ బెలూన్‌ను గ్రౌండ్‌లో ఎగరవేశారు. మ్యాచ్ కంప్లీట్ అయ్యేవరకు అది అక్కడికి వచ్చే వీక్షకులను ఆకట్టుకోనుంది. కోల్‌కతాలో  157 అడుగుల షహీద్‌ మినార్‌తో పాటు అన్ని ప్రాంతాల్లో పింక్‌ లైట్లు జిగేలుమంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ఉపయోగించేది కూడా పింక్ బాలే కావడం విశేషం. దీంతో కోల్‌కతాలో పింక్ సందడి జోరందుకుంది. ఇక క్రికెట్ లవర్స్‌ను మరింత ఎగ్జైట్ చేసేందుకు..కోల్‌కతాలో సిటీ వ్యాప్తంగా  12 బిల్‌ బోర్డులను, 6 ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు.