
Jake Weatherald Dismissal: అప్పుడప్పుడూ క్రికెట్‌లో ఫన్నీ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా అనేకం జరుగుతాయి. అయితే ఒకే బంతికి బ్యాట్స్‌మెన్ రనౌట్ కావడం ఎప్పుడైనా చూశారా.. బహుశా ఇప్పటివరకు ఈ సంఘటనను ఎప్పుడూ చూసి ఉండరు. ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్‌బాష్ టీ20 క్రికెట్ లీగ్‌లో ఇది జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఆదివారం అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ జట్టు బ్యాట్స్‌మెన్ జాక్ వెదరాల్డ్(31) ఒకే బంతికి రెండుసార్లు.. రెండు ఎండ్స్‌లోనూ ఔట్ కావడం విశేషం. బౌలర్ క్రిస్ గ్రీన్ వేసిన ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఫిల్ సాల్ట్(31) నేరుగా బంతిని బౌలర్ వైపు కొట్టడంతో.. అది అతడి చేతులను తాకుతూ వికెట్లను కొట్టేసింది.
అప్పుడే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జాక్ ఆ విషయాన్ని గమనించకుండా పరుగు తీశాడు. అయితే అతడు క్రీజుకు చేరుకునే లోపే కీపర్ వికెట్లను గిరాటేశాడు. ఇక టీవీ రిప్లేలో జాక్ రెండు వైపులా ఔట్ అయినట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియోను బిగ్ బాష్ లీగ్ తన ట్విట్టర్‌లో పంచుకోగా అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది.
What just happened?! Jake Weatherald somehow got run out at both ends, on the same ball! ?
A @KFCAustralia Bucket Moment | #BBL10 pic.twitter.com/eLRurkBQtp
— KFC Big Bash League (@BBL) January 24, 2021