Hardik Pandya The Success Story: వర్షం కోసం ఓ ఊరిప్రజలంతా యజ్ఞం చేయతలపెట్టారంట.. అందరూ ఆయజ్ఞ వాటిక దగ్గరికి వెళుతున్నారు… ఒకతను మాత్రం గొడుగు వేసుకొని మరీ అక్కడికి వెళుతున్నాడు..అది చేసే పని మీద నమ్మకం అంటే. సేమ్ టు సేమ్.. 9 వ తరగతి ఫెయిలైన ఓ కుర్రాడు ఇంగ్లీష్ ను మాత్రం వదల్లేదు.. అందులో ఫర్ఫెక్ట్ అయ్యాడు.. ఎందుకు నీకు ఇంత కష్టం అంటే.. రేపొద్దున్న నేను గొప్పవాన్ని అయితే ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా!.. అందుకే ఇంగ్లీష్ ను వదిలేది లేదన్నాడు ఆ కుర్రాడు. ఇది ఆత్మవిశ్వాసం అంటే.. యస్ ఆ కుర్రాడు మాటల వరకే పరిమితం కాలేదు.. నిజజీవితంలో ఆవిష్కరించాడు.. ఈరోజు భారత క్రికెట్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు.. అతనే హార్ధిక్ పాండ్యా.. బంగ్లా తో ఫైనల్ ఓవర్ వేసి భారత్ ను గెలిపించాడు యువకిశోరం
2016 టీ-20 ప్రపంచ్ కప్ లో భారత్ బంగ్లాదేశ తో తలపడుతోంది. ఇక అందరూ భారత్ గెలుపు మీద ఆశలు వదిలేసుకొన్న వేళ… భారత్ ప్రజల ఆశలను తన భుజాన మోస్తూ.. బౌలింగ్ చేస్తోన్న వ్యక్తి లాస్ట్ ఓవర్ లో మూడు బాల్స్ కు ఇక రెండు పరుగులు చేస్తే బంగ్లా దేశ్ గెలుపు.. ఇక అభిమానులు గెలుపుపై ఆశలు వదిలేసుకొన్న సమయంలో ఓవర్ లో నాలుగో బాల్ వికెట్, ఐదో బాల్ వికెట్ ఇక లాస్ట్ బాల్ కి రెండు పరుగులు కెప్టెన్ సూచనని తూచా తప్పకుండా బాల్ వేసి భారత్ ను గెలుపు ముంగిట సగర్వంగా నిలబెట్టిన హార్ధిక్ పాండ్యా… ఇప్పుడు చాలా ఫేమస్ క్రికెటర్. కానీ అతను పుడుతూనే గోల్డెన్ స్పూన్ ను నోట్లో పెట్టుకొని పుట్టలేదు.. తినడానికి తిండి లేదు.. సరైన వసతి లేదు.. కానీ క్రికెట్ అంటే ప్రాణం దానికోసం ఎంతో కష్ట పడ్డాడు.. చివరకు తాను అనుకొన్నది సాధించాడు. ఈ తరానికి ఆదర్శ యువకుడిగా నిలబడ్డాడు.
తినడానికి తిండి లేని ఓ యువకుడు 9వ తరగతి ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంగ్లీష్ పై పట్టు సాధించాడు. ఎందుకు ఇంగ్లీష్ ను ఇంత పట్టుదలగా నేర్చుకుంటున్నవంటే రేపు నేను గొప్పవాడిని అయ్యాక ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అని చెప్పాడు. చెప్పడమే కాదు తను తనకిష్టమైన క్రికెట్ ఆటలో గొప్పవాడు కావడం కోసం ఎన్నింటినో వదులు కున్నాడు. చివరకు సాధించాడు. ఒక సంవత్సరం ఐదు రూపాయల మ్యాగీతోనే కడుపు నింపుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం క్రికెట్ ఆడిన హార్ధిక్ ఇప్పుడు ఇండియా క్రికెట్ టీం లో చోటు సంపాదించే వరకూ చేసిన జర్నీ ప్రతి యువకుడికి ఆదర్శం.
హార్ధిక్ ఆటను చూసిన సచిన్ నీవు ఇండియా కోసం ఏడాది లోపులో ఆడతావు అని అన్నాడు. కానీ ఏడాది కాకుండానే ఇండియా క్రికెట్ సభ్యుడిగా చోటు సంపాదించుకొన్నాడు. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకొన్నాడు. ఈ సందర్భం లో హార్ధిక్ మాట్లాడుతూ.. నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తం ముంబై ఇండియన్స్ నన్ను కొనుగోలు చేసి ఇచ్చిన పది లక్షల చెక్కు.. ఈ ఒక్క చెక్కుతో మా కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పాడు.
ప్రస్తుతం కీలక ఆల్ రౌండర్ గా ఎదిగన హార్ధిక పాండ్యా మెరుపులాంటి ఫీల్డింగ్, పొదుపు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయడం లో కూడా దిట్ట.. దీంతో భారత్ కు ఆల్ రౌండర్ గా హార్ధిక్ పాండ్యా ఫేవరెట్ ప్లేయర్. బంగ్లాదేశ్ తో హార్ధిక్ వేసిన లాస్ట్ ఓవర్ ప్రపంచానికి అతనిని పరిచయం చేసింది.
సెర్బియా నటి, మోడల్ అయిన నటాషాతో పాండ్యా డేటింగ్ అనంతరం గతఏడాది పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గత ఏడాది మే లో ముద్దుల కొడుకు పుట్టాడు. అగస్త్య పేరు పెట్టారు. ఇక 2021 జనవరి 16న హార్దిక్ తండ్రి హిమాన్షు పాండ్యా గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఎంపిక అయ్యిన.. అదే బరిలోకి దిగే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.
Also Read: