న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి న్యూజిలాండ్ క్రికెట్(NCZ) శుక్రవారం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఒక టీ-20, ఐదు వన్డే మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న తొలిగే టీ-20 మ్యాచ్‌తో భారత పర్యటన ఆరంభం కానుంది. కాగా మార్చి- ఏప్రిల్ మధ్య కాలంలో న్యూజిలాండ్ వేదికగానే మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలో ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగానే బీసీసీఐ ఈ సిరీస్ ఏర్పాటుచేసింది.
న్యూజిలాండ్‌లోని ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్‌లతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితులకు భారత మహిళలు బాగా అలవాటు పడేందుకు ఈ టోర్నీని నిర్వహించనుంది. కాగా భారత్, న్యూజిలాండ్ జట్లు చివరిసారిగా 2019 జనవరిలో తలపడ్డాయి. న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో చేజిక్కించుకోగా, మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను కివీస్ క్లీన్‌స్వీప్ చేసింది.
న్యూజిలాండ్‌లో భారత మహిళల జట్టు షెడ్యూల్ ఇదే.
మొదటి టీ-20 మ్యాచ్- ఫిబ్రవరి9- నేపియర్
మొదటి వన్డే – ఫిబ్రవరి11- నేపియర్
రెండో వన్డే – ఫిబ్రవరి14- నెల్సన్
మూడో వన్డే – ఫిబ్రవరి16- నెల్సన్
నాలుగో వన్డే – ఫిబ్రవరి 22- క్వీన్స్‌టౌన్
ఐదో వన్డే – ఫిబ్రవరి 25 – క్వీన్స్‌టౌన్
Also Read:
Hockey India: మరోసారి టీమిండియాను ఛాంపియన్ చేస్తాం.. సరికొత్త వ్యూహాలతో బరిలోకి: వివేక్ సాగర్