కరోనా ప్రభావం : ప్రపంచ ర్యాంకింగ్స్లో చోటు నిలుపుకున్న భారత్ హాకీ జట్టు
భారత హాకీ జట్టు సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ కీలక స్థానాలను కైవసం చేసుకుంది. భారత పురుషుల జట్టు నాలుగో స్థానం, మహిళల హాకీ జట్టు తొమ్మిదో స్థానాన్ని దక్కించకుంది.
భారత హాకీ జట్టు సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ కీలక స్థానాలను కైవసం చేసుకుంది. భారత పురుషుల జట్టు నాలుగో స్థానం, మహిళల హాకీ జట్టు తొమ్మిదో స్థానాన్ని దక్కించకుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఈ ఏడాది జరగాల్సిన అన్ని మ్యాచ్లు రద్దయ్యాయి. బెల్జియం పురుషుల హాకీ జట్టు, నెదర్లాండ్ మహిళల హాకీ జట్టు.. ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐఎఫ్హెచ్) ప్రకటించింది. చైనా చివరి స్థానంలో కొనసాగుతోంది.
పురుషుల హాకీ జట్ల ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి….
1. బెల్జియమ్ (2496.88 పాయిట్లు)
2.ఆస్ట్రేలియా (2385.70 పాయిట్లు)
3.నెదర్లాండ్స్ (2252.96 పాయిట్లు)
4.భారత్ (2063.378 పాయిట్లు)
5.అర్జెంటీనా (1967.39 పాయిట్లు)
6.జర్మనీ (1944.34 పాయిట్లు)
7.ఇంగ్లాండ్ (1743.77 పాయిట్లు)
8.న్యూజిలాండ్ (1575.00 పాయిట్లు)
మహిళల హాకీ జట్టు ర్యాంకింగ్స్
1.నెదర్లాండ్ (2331.99 పాయిట్లు)
2.అర్జెంటీనా (2174.61 పాయిట్లు)
3.జర్మనీ (2054.28 పాయిట్లు)
4.ఆస్ట్రేలియా (2012.89 పాయిట్లు)
5.ఇంగ్లాండ్ (1952.74 పాయిట్లు)
6.న్యూజిలాండ్ (1818.98 పాయిట్లు)
7.స్పెయిన్ (1802.13 పాయిట్లు)
8.ఐర్లాండ్ (1583.09 పాయిట్లు)
9.భారత్ (1543.00 పాయిట్లు)
10.చైనా (1521.00 పాయిట్లు)