ట్వీట్లు మానేసి… సాయం చేయండి!

అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీనితో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం 33 జిల్లాల్లోనూ వరద ప్రభావం తారాస్థాయికి చేరింది. వీటన్నంటిని మించి వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. దీంతో జంతువులకు దిక్కులేకుండా పోయింది. ఇంతటి దీనస్థితిని చూసి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చలించిపోయి.. వెంటనే 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. అందులో […]

ట్వీట్లు మానేసి... సాయం చేయండి!

Updated on: Jul 21, 2019 | 5:47 PM

అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీనితో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం 33 జిల్లాల్లోనూ వరద ప్రభావం తారాస్థాయికి చేరింది. వీటన్నంటిని మించి వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. దీంతో జంతువులకు దిక్కులేకుండా పోయింది. ఇంతటి దీనస్థితిని చూసి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చలించిపోయి.. వెంటనే 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. అందులో కోటి రూపాయలు అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి.. మరో కోటి రూపాయలు కజిరంగ నేషనల్ పార్క్‌కు విరాళంగా అందించాడు. అంతేకాకుండా తన ట్విట్టర్ ద్వారా బాధితులకు సాయం చేయమని అందరికి విజ్ఞప్తి చేశాడు. దీనికి స్పందించిన భారత స్పింటర్‌ హిమ దాస్‌.. తన నెల జీతంలో సగం డబ్బును అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. ‘‘అసోంలో వరదల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 33 జిల్లాల్లో 30 జిల్లాలు వరదల వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని అందరిని కోరుకుంటున్నాను’అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొంది.

ఇలా ప్రముఖులందరూ తమకు తోచిన సాయం అందించాలని నెటిజన్లు కోరుతుండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు మాత్రం… అస్సాంలోని పరిస్థితులు చూస్తుంటే గుండె కలిచివేస్తోందని ట్వీట్లతో సరిపెట్టుకున్నారు. క్రికెట్ ఆడుతూ కోట్లు సంపాదించి.. ఇలా ట్వీట్లు చేయడం భావ్యం కాదని.. ఇలాంటి దీనపరిస్థితులలో సాయం చేస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మీరు సహాయం చేయడం వల్ల అక్కడి అభాగ్యులు కోలుకుంటారని ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా వేడుకుంటున్నారు. దయ చేసి ట్వీట్లు ఆపి.. విరాళాలు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.