WTC Final Match: ఎయిర్‌పోర్ట్‌లో కూతురుతో విరుష్క జంట.. జర్నలిస్టుల కంట పడకుండా ఎలా చేశారో చూడండి..

|

Jun 03, 2021 | 5:24 PM

WTC Final Match: టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో పాల్గొనడానికి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరింది.

WTC Final Match: ఎయిర్‌పోర్ట్‌లో కూతురుతో విరుష్క జంట.. జర్నలిస్టుల కంట పడకుండా ఎలా చేశారో చూడండి..
Virat Kohli
Follow us on

WTC Final Match: టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో పాల్గొనడానికి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరింది. దాదాపు నాలుగు నెలల పాటు జరుగనున్న ఈ టోర్నీ కోసం.. టీమిండియా క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వెంట వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కుమార్తె వామికాతో ఎయిర్‌పోర్ట్‌కు రాగా.. ఫోటో జర్నలిస్టులు వారిని తమ కెమెరాలో బందించారు. అయితే, జర్నలిస్టులు ఫోటో తీయడాన్ని గమనించిన అనుష్క.. తమ కుమార్తె వామికనను క్లాత్‌తో పూర్తిగా కవర్ చేసింది. బయటకు కనిపించుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పిక్స్‌ని పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడవి వైరల్‌గా మారాయి.

కాగా, తమ కూతురు వామికా ప్రైవసీకి గౌరవం ఇవ్వండని, దయచేసి ఫోటోలు తీయకండి అంటూ గతంలోనే విరుష్క జంట ఫోటో జర్నలిస్టులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జర్నలిస్టులు ఆ చిన్నారిని ఫోటో తీసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. విరుష్క జోడితో వామికా ఉన్నట్లు గమనిస్తే చాలు మీదపడిపోయి మరీ ఫోటోలు తీసేస్తున్నారు. అయితే, ఫోటోలు తీసేవారి పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రైవసీ ఇవ్వాలని, ఫోటోలు తీయొద్దని విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. క్రికెట్ సిరీస్‌ కోసం భారత పురుషుల జట్టు, మహిళా క్రికెట్ జట్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది కూడా వెళ్లేందుకు అనుమంతించారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను బయో బబుల్ పరిధిలోనే ఉండేలా చూడాలని ఆటగాళ్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, కాగా, దేశంలో కరోనా ఆంక్షల నేపథ్యంలో జూన్ 18 నుంచి 22వ తేదీ వరకు సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌కు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా తో పాటు బిసిసిఐ కార్యవర్గంలో ఉన్నవారు ఎవరూ హాజరవడం లేదు.

ఇదిలాఉంటే.. భారత పురుష, మహిళా జట్ల సభ్యులు ఇప్పటికే 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో వీరందరికీ నెగిటీవ్ అని తేలింది. దీంతో బుధవారం నాడు వీరంతా చార్టర్డ్ ఫైల్‌లో ఇంగ్లండ్‌కు బయలుదేరారు. అయితే, అక్కడికి వెళ్లిన తరువాత కూడా మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు.

Virat Kohli and Anushka

Also read:

Mosque Loud Speaker: సౌదీ అరేబియా సర్కార్ సంచలన నిర్ణయం.. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు