తడబడ్డ టాప్ ఆర్టర్.. ఆదుకున్న రహానె

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్ట్ మొదటి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. టీ20, వన్డే సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియాకు.. తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. విండీస్‌ ఫాస్ట్‌బౌలర్లు రోచ్‌, గాబ్రియెల్‌ ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన మయాంక్‌ ఐదో ఓవర్లో రోచ్‌ […]

తడబడ్డ టాప్ ఆర్టర్.. ఆదుకున్న రహానె

Edited By:

Updated on: Aug 23, 2019 | 8:26 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్ట్ మొదటి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. టీ20, వన్డే సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియాకు.. తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. విండీస్‌ ఫాస్ట్‌బౌలర్లు రోచ్‌, గాబ్రియెల్‌ ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన మయాంక్‌ ఐదో ఓవర్లో రోచ్‌ బౌలింగ్‌లో 5 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం అదే ఓవర్లో పుజారాను కూడా ఔట్‌ చేయడం ద్వారా భారత్‌ను రోచ్‌ గట్టి దెబ్బతీశాడు. కెప్టెన్‌ కోహ్లీ బాగానే ఆరంభించినా.. గాబ్రియెల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

కోహ్లీ అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె.. రాహుల్‌తో ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్టును ముందుకు నడిపారు. అనంతరం చేజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ఔట్‌ కావడంతో 68 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం విహారితో కలిసి రహానె ఇన్నింగ్స్‌ను నడిపిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కాసేపటికి విహారీ, రహానే ఔటయ్యాక పంత్‌ 20 పరుగులతో, జడేజా 3 పరుగులతో వికెట్‌ పడకుండా ఇన్నింగ్స్‌ సాగిస్తున్న దశలో వరుణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. ఫలితంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముందుగానే నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి భారత్ 68.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.