Ravindra Jadeja ‘grossly underrated’, team will miss him, says Mohammad Kaif రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి 11 ఏళ్లయిందని, అతన్ని ఇప్పటికీ తక్కువగా అంచనా వేస్తున్నారని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… జడేజా ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడని అన్నారు. తన బౌలింగ్‌తోనూ ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడని కితాబిచ్చారు. మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యాతో కలిసి చేసిన 150 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని ఎవరు మరిచిపోరని తెలిపారు. టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు జడేజా గాయంతో దూరమవడం పెద్ద లోటుగా మారనుందని అన్నారు. టీమిండియా అతని సేవలను మిస్ కానుందన్నారు కైఫ్.
ఆసీస్‌తో జరిగిన మొదటి టీ20లో జడేజా 23 బంతుల్లోనే 44 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 19వ ఓవర్లో మూడు బంతుల తర్వాత జడేజా కండరాల నొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. తర్వాతి ఓవర్ రెండో బంతికి స్టార్క్ వేసిన బంతి అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. అయితే ఆ సమయంలో భారత ఫిజియో రాకపోగా, జడేజా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత నొప్పితో ఇబ్బంది పడిన జడేజా ఫీల్డింగ్‌కు రాలేదు. జడేజా తలకు తగిలిన దెబ్బను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా టి20 సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి ఎంపిక చేశామని బీసీసీఐ ప్రకటించింది.