టార్గెట్.. సిరీస్ క్లీన్‌ స్వీప్..!

వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా మరో సమరానికి సన్నద్ధమైంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఆఖరి వన్డేలో విండీస్‌ను ఢీకొట్టనుంది. టీ20ల మాదిరిగానే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని కోహ్లీసేన భావిస్తుంటే.. ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆతిధ్య విండీస్ ఆరాటపడుతోంది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఫామ్‌లో లేని భారత్ ఓపెనర్ ధావన్‌పైనే ఉంది. ఇప్పటివరకు సొంతగడ్డపై పేలవంగా ఆడుతున్న కరీబియన్ జట్టు టీమిండియాను నిలువరిస్తుందో లేదో […]

టార్గెట్.. సిరీస్ క్లీన్‌ స్వీప్..!

Edited By:

Updated on: Aug 14, 2019 | 4:29 PM

వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా మరో సమరానికి సన్నద్ధమైంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఆఖరి వన్డేలో విండీస్‌ను ఢీకొట్టనుంది. టీ20ల మాదిరిగానే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని కోహ్లీసేన భావిస్తుంటే.. ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆతిధ్య విండీస్ ఆరాటపడుతోంది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఫామ్‌లో లేని భారత్ ఓపెనర్ ధావన్‌పైనే ఉంది. ఇప్పటివరకు సొంతగడ్డపై పేలవంగా ఆడుతున్న కరీబియన్ జట్టు టీమిండియాను నిలువరిస్తుందో లేదో వేచి చూడాలి. కాగా వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతానని ప్రకటించిన గేల్‌కు బహుశా ఇదే చివరి మ్యాచ్‌ కావొచ్చు.