ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!

|

Feb 26, 2021 | 5:17 PM

World Test Championship: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా అడుగు దూరంలో ఉంది. అహ్మదాబాద్...

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!
రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, విహారి, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్‌‌లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఎంపికైన 15 మంది సభ్యులు కాగా.. వీరిలో ఉమేష్ యాదవ్, సిరాజ్, సాహా, విహారిలు తుది జట్టులో ఉండరని సమాచారం.
Follow us on

World Test Championship: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా అడుగు దూరంలో ఉంది. అహ్మదాబాద్ మొతేరా స్టేడియం వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ను 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ రెండు వరుస విజయాలు నమోదు చేయడంతో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించేందుకు అడుగు దూరంలో ఉండటమే కాకుండా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది.

చివరి టెస్టు మ్యాచ్‌లో ఒకవేళ భారత్ ఓడిపోతే.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలబడనుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌ను (2-1, 3-1, 2-0 లేదా 4-0) భారత్ గెలుచుకుంటేనే ఫైనల్‌కు చేరుతుంది. మొదటి టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. మిగిలిన రెండు టెస్టుల్లోనూ అద్భుత విజయాలను అందుకోవడం విశేషం. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో తలపడే ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా చేరుకోవాలంటే.. టీమిండియా మార్చి 4న అహ్మదాబాద్‌లో జరగబోయే చివరి మ్యాచ్‌ డ్రాగా ముగించాలి. లేదా గెలిచి తీరాలి. (World Test Championship India In Top Spot) 

“పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ 64.1 శాతం పాయింట్లకు పడిపోగా.. ఇండియా 71 శాతం పాయింట్లతో టాప్‌కు చేరుకుంది. అహ్మదాబాద్ ఓటమితో ఇంగ్లాండ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో వెనుకబడి ఉంది. ఇక ఒకవేళ ఫైనల్ టెస్ట్‌లో భారత్ ఓడిపోతే.. 69.2 శాతం పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్తుంది.

పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయభేరి…

నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా 49 పరుగుల చిన్న టార్గెట్‌తొ బరిలోకి దిగింది. ఆ జట్టు నిర్దేశించిన 49 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్‌ 19 పరుగులతో సరిపెట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 5 వికట్లు, అశ్విన్‌ 4, సుందర్‌ ఒక వికెట్‌ తీశాడు.

(World Test Championship) 

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?