అరుదైన రికార్డుకి చేరువలో కేఎల్ రాహుల్!

|

Aug 03, 2019 | 7:11 PM

భారత యువ  బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ టీ20ల్లో అరుదైన రికార్డ్‌కి చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో ఈరోజు ఫ్లోరిడా వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 121 పరుగులు చేస్తే.. టీ20ల్లో వేగంగా 1,000 పరుగుల మార్క్‌ని అందుకున్న క్రికెటర్‌గా రికార్డుల్లో చోటు సంపాదించనున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ వేగంగా వెయ్యి పరుగుల మార్క్‌ని అందుకున్నవారిలో.. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 26 ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు చేయగా.. ఆ తర్వాత భారత కెప్టెన్ […]

అరుదైన రికార్డుకి చేరువలో కేఎల్ రాహుల్!
Follow us on

భారత యువ  బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ టీ20ల్లో అరుదైన రికార్డ్‌కి చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో ఈరోజు ఫ్లోరిడా వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 121 పరుగులు చేస్తే.. టీ20ల్లో వేగంగా 1,000 పరుగుల మార్క్‌ని అందుకున్న క్రికెటర్‌గా రికార్డుల్లో చోటు సంపాదించనున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ వేగంగా వెయ్యి పరుగుల మార్క్‌ని అందుకున్నవారిలో.. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 26 ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు చేయగా.. ఆ తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మార్క్‌కి చేరువలో ఉన్న కేఎల్ రాహుల్ ప్రస్తుతం 24 ఇన్నింగ్స్‌ల్లోనే 879 పరుగులతో కొనసాగుతున్నాడు. దీంతో.. ఈరోజు అతను 121 పరుగులు చేస్తే..? అందరికంటే ఫాస్ట్‌గా ఆ రికార్డ్‌ని అందుకున్న క్రికెటర్‌గా నిలవనున్నాడు.