భారత్‌, ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: మెక్‌గ్రాత్‌

|

Mar 22, 2019 | 5:59 PM

చెన్నై: మరో రెండు నెలల్లో ఇంగ్లండ్‌ వేదికగా  వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. కాగా  అన్ని దేశాల ఆటగాళ్లు కూడా ఈ మెగా టోర్నీ కోసం గ్రౌండ్‌లో నిర్విరామంగా శ్రమిస్తున్నారు.  రానున్న ఐపీఎల్ సీజన్‌ను ఇందుకోసం వార్మప్‌గా భావిస్తున్నారు. కాగా  భారత జట్టు వన్డే వరల్డ్‌కఫ్  హాట్‌ ఫేవరెట్‌ అని ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు. భారత్‌తో పాటు ఇంగ్లండ్‌ కూడా వరల్డ్‌కప్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటన్నాడు. భారత్‌, ఇంగ్లండ్‌లకు వరల్డ్‌కప్‌ గెలిచే సత్తా […]

భారత్‌, ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: మెక్‌గ్రాత్‌
Follow us on

చెన్నై: మరో రెండు నెలల్లో ఇంగ్లండ్‌ వేదికగా  వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. కాగా  అన్ని దేశాల ఆటగాళ్లు కూడా ఈ మెగా టోర్నీ కోసం గ్రౌండ్‌లో నిర్విరామంగా శ్రమిస్తున్నారు.  రానున్న ఐపీఎల్ సీజన్‌ను ఇందుకోసం వార్మప్‌గా భావిస్తున్నారు. కాగా  భారత జట్టు వన్డే వరల్డ్‌కఫ్  హాట్‌ ఫేవరెట్‌ అని ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు. భారత్‌తో పాటు ఇంగ్లండ్‌ కూడా వరల్డ్‌కప్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటన్నాడు. భారత్‌, ఇంగ్లండ్‌లకు వరల్డ్‌కప్‌ గెలిచే సత్తా ఉందంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు. భారత్‌లో టీ20, వన్డే సిరీస్‌లు నెగ్గిన తర్వాత వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై అంచనాలు పెరిగాయని చెప్పాడు. ఆసీస్‌ పర్యటనలో భారత బౌలర్ల ప్రదర్శన తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదన్నాడు.

కాగా, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లిపై మెక్‌గ్రాత్‌ ప్రశంసలు కురిపించాడు. అతనొక అసాధారణ ఆటగాడిగా అభివర్ణించిన మెక్‌గ్రాత్‌.. అతని కెరీర్‌ ముగిసే సమయానికి దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా తరహాలో చరిత్రలో నిలిచిపోతాడన్నాడు. అదే సమయంలో భారత్‌ పేస్‌ బౌలర్లు బుమ్రాకి రివర్స్‌ స్వింగ్‌ లభిస్తే ప్రత్యర్థలకు ప్రమాదకారిగా మారతాడని అభిప్రాయపడ్డాడు.