ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో భారత్ నుంచి ఇద్దరే.. రాహుల్‌, కోహ్లీ మినహా ఎవ్వరికీ దక్కని చోటు..

|

Feb 16, 2021 | 3:34 AM

ICC T20I Rankings - KL Rahul, Virat Kohli : ఐసీసీ మెన్స్‌ టీ 20 ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. భారత బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానం ఎగబాకి రెండో...

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో భారత్ నుంచి ఇద్దరే.. రాహుల్‌, కోహ్లీ మినహా ఎవ్వరికీ దక్కని చోటు..
Follow us on

ICC T20I Rankings – KL Rahul, Virat Kohli : ఐసీసీ మెన్స్‌ టీ 20 ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. భారత బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంకుకు చేరగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ (915 రేటింగ్‌ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 816 రేటింగ్ పాయింట్లతో కేఎల్ రాహుల్ రెండో స్థానానికి ఎగబాకగా.. టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 697 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్‌ తబ్రైజ్‌ షంషీ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు రెండో స్థానానికి చేరాడు. ఇక ఆఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. టీ20 ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘానిస్థాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ మొదటి స్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మినహా.. ఆల్‌రౌండర్‌, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఏ ఒక్క భారత ఆటగాడికి చోటు దక్కలేదు.

Also Read:

Naman Ojha: క్రికెట్‌కు నమన్‌ ఓజా గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ కన్నీంటి పర్యంతమైన వికెట్ కీపర్..

IPL 2021: ప్రాంచైజీ పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..! ఈ సారైనా అద‌ృష్టం కలిసొచ్చేనా..?