ఓవర్ త్రో‌‌పై వారిదే తుది నిర్ణయం.. తేల్చి చెప్పిన ఐసీసీ!

ప్రపంచకప్ ఫైనల్‌ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. అంపైర్ల పొరబాట్లు, ఐసీసీ రూల్స్‌పై ఇంకా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్ జరుగుతున్న సమయంలో చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విసిరిన త్రోకు బాల్ బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్ళింది. దీనికి ఆన్- ఫీల్డ్ అంపైర్లు 6 పరుగులు ఇవ్వగా.. ఐసీసీ రూల్స్ ప్రకారం 5 పరుగులే ఇవ్వాలని లెజెండరీ అంపైర్ సైమన్ టాఫుల్ ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపాడు. […]

ఓవర్ త్రో‌‌పై వారిదే తుది నిర్ణయం.. తేల్చి చెప్పిన ఐసీసీ!

Updated on: Jul 17, 2019 | 5:49 PM

ప్రపంచకప్ ఫైనల్‌ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. అంపైర్ల పొరబాట్లు, ఐసీసీ రూల్స్‌పై ఇంకా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్ జరుగుతున్న సమయంలో చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విసిరిన త్రోకు బాల్ బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్ళింది. దీనికి ఆన్- ఫీల్డ్ అంపైర్లు 6 పరుగులు ఇవ్వగా.. ఐసీసీ రూల్స్ ప్రకారం 5 పరుగులే ఇవ్వాలని లెజెండరీ అంపైర్ సైమన్ టాఫుల్ ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపాడు. అటు సూపర్ ఓవర్‌ టై అయితే విజేతను నిర్ణయించడంలో ఐసీసీ విధించిన రూల్స్‌పై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా విమర్శలు గుప్పించారు.

ఇక ఆ వివాదాస్పద ఓవర్ త్రోపై ఐసీసీ ఎట్టికేలకు స్పందించింది. ఆన్- ఫీల్డ్ అంపైర్ల నిర్ణయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని.. నిబంధనలపై వారికున్న అవగాహన మేరకే నిర్ణయాన్ని తీసుకుంటారని ఐసీసీ స్పష్టం చేసింది. విధానపరమైన ఇటువంటి నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఐసీసీ వెల్లడించింది. ఏది ఏమైనా వరల్డ్‌కప్ ముగిసి నాలుగు రోజులైనా సోషల్ మీడియాలో ఫైనల్‌పై వాడీవేడి చర్చ కొనసాగుతోంది.