బీసీసీఐకు ఇదో కొత్త ఫ్యాషన్ అయింది: గంగూలీ ఫైర్

| Edited By:

Aug 07, 2019 | 2:01 PM

భారత క్రికెట్ బోర్డు బీసీసీఐపై టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఫైర్ అయ్యారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గంగూలీ.. ‘‘భారత క్రికెట్‌లో ఇదో కొత్త ఫ్యాషన్ అయ్యింది. వార్తల్లో నిలవడానికి బీసీసీఐకు ఇంతకంటే మంచి మార్గం దొరకలేదేమో. భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలి. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై ద్రవిడ్‌కు నోటీసులు అందాయి’’ […]

బీసీసీఐకు ఇదో కొత్త ఫ్యాషన్ అయింది: గంగూలీ ఫైర్
Follow us on

భారత క్రికెట్ బోర్డు బీసీసీఐపై టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఫైర్ అయ్యారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన గంగూలీ.. ‘‘భారత క్రికెట్‌లో ఇదో కొత్త ఫ్యాషన్ అయ్యింది. వార్తల్లో నిలవడానికి బీసీసీఐకు ఇంతకంటే మంచి మార్గం దొరకలేదేమో. భారత క్రికెట్‌ను దేవుడే కాపాడాలి. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై ద్రవిడ్‌కు నోటీసులు అందాయి’’ అని ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.

ఇక ఈ ట్వీట్‌కు మరో క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘నిజంగానా..? ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు. భారత క్రికెట్‌కు అంతకంటే మంచి ఆటగాణ్ణి పొందలేదు. ఇలాంటి లెజండ్‌లకు నోటీసులు పంపడం వారిని అవమానించడమే. అలాంటి వారి సేవలను క్రికెట్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. అవును ఇండియన్ క్రికెట్‌ను దేవుడే కాపాడాలి’’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(బెంగళూరు)డైరక్టర్‌గా వ్యవహరిస్తోన్న ద్రవిడ్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఈ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఫ్రాంఛైజీ ఉండగా.. ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దీనిపై స్పందించాలంటూ ఎథిక్స్ ఆఫీసర్ నుంచి ద్రవిడ్‌కు నోటీసులు జారీ అయ్యాయి.