ఫార్మాట్‌తో పనిలేదు..వారిద్దరూ గ్రౌండ్‌లోకి దిగితే ఉగ్రరూపమే అంటున్న గంభీర్..

| Edited By: Srinu

Oct 11, 2019 | 3:46 PM

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై..  మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవలే  టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ తెచ్చుకొన్న హిట్ మ్యాన్.. తొలి టెస్టులోనే రెండు సెంచరీలతో అదరహో అనిపించాడు.  ఈ నేపథ్యంలో.. రోహిత్ ఓపెనర్‌గా రావాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయమని గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. అవి టెస్టులా, వన్డేలా, టీ20 లా .. అన్నది కాకుండా రోహిత్ తన సహజ ఆటతీరును కొనసాగించాలని చెప్పారు. అలాగే ప్రస్తుత […]

ఫార్మాట్‌తో పనిలేదు..వారిద్దరూ గ్రౌండ్‌లోకి దిగితే ఉగ్రరూపమే అంటున్న గంభీర్..
Gautam Gambhir
Follow us on

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై..  మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవలే  టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ తెచ్చుకొన్న హిట్ మ్యాన్.. తొలి టెస్టులోనే రెండు సెంచరీలతో అదరహో అనిపించాడు.  ఈ నేపథ్యంలో.. రోహిత్ ఓపెనర్‌గా రావాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయమని గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. అవి టెస్టులా, వన్డేలా, టీ20 లా .. అన్నది కాకుండా రోహిత్ తన సహజ ఆటతీరును కొనసాగించాలని చెప్పారు. అలాగే ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర, అత్యంత స్థాయి కలిగిన ఆటగాడు రోహిత్ శర్మే అన్నాడు. ఫార్మాట్‌కు సంబంధం లేని సెహ్వాగ్ లాంటి దూకుడుని  రోహిత్‌ శర్మలో చూశానన్న గౌతీ..అతడు అదే ఆటతీరును కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

కాగా, రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.  అయితే, రోహిత్‌ టెస్టుల్లో ఓపెనర్‌గా ఎలా ఆడతాడనే దానిపైనే అందరూ ఎక్కువ ఫోకస్‌ పెట్టారని, దీంతో రోహిత్ శర్మ ఒత్తిడి గురయ్యే అవకాశం ఉందని అన్నాడు. అందువల్ల విశ్లేషకులు, మీడియా రోహిత్‌పై ఫోకస్‌ తగ్గించుకోవాలని కోహ్లీ విజ్ఞప్తి చేశాడు.