తప్ప తాగి.. రచ్చ చేసిన టీమిండియా క్రికెటర్…

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను, తన కొడుకును దుర్భాషలాడటమే కాకుండా దాడి కూడా చేశాడని దీపక్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రవీణ్ మద్యం మత్తులో తూలుతున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సుమారు మధ్యాహ్నం 3 గంటలకు తాను కొడుకు స్కూల్ బస్సు కోసం వేచి చూస్తుండగా.. ప్రవీణ్ కారుకు స్కూల్ బస్సు అడ్డు రావడంతో.. అతడు బస్సు డ్రైవర్‌‌తో గొడవకి దిగి దుర్భషలాడటం మొదలుపెట్టాడు. […]

తప్ప తాగి.. రచ్చ చేసిన టీమిండియా క్రికెటర్...

Updated on: Dec 16, 2019 | 6:07 AM

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను, తన కొడుకును దుర్భాషలాడటమే కాకుండా దాడి కూడా చేశాడని దీపక్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రవీణ్ మద్యం మత్తులో తూలుతున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సుమారు మధ్యాహ్నం 3 గంటలకు తాను కొడుకు స్కూల్ బస్సు కోసం వేచి చూస్తుండగా.. ప్రవీణ్ కారుకు స్కూల్ బస్సు అడ్డు రావడంతో.. అతడు బస్సు డ్రైవర్‌‌తో గొడవకి దిగి దుర్భషలాడటం మొదలుపెట్టాడు.  ఇక తాను అడ్డు చెప్పేందుకు ప్రయత్నించగా.. ప్రవీణ్ తనపై దాడి చేశాడని దీపక్ శర్మ తెలిపారు. ఈ గొడవలో తన చెయ్యికి ఫ్రాక్చర్ కావడమే కాకుండా.. తన ఏడేళ్ల కొడుకును కూడా తోసేయడంతో అతనికి గాయాలు అయ్యాయని పేర్కొన్నాడు.

అయితే ప్రవీణ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని దీపక్ వాపోయాడు. అంతేకాక తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపాడు. ఇకపోతే ఈ వ్యవహారంపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ.. ప్రవీణ్, దీపక్ మధ్య జరిగిన గొడవపై దర్యాప్తు ప్రారంభించామని.. ప్రవీణ్ తప్పు చేసినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us