వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్ రాబోయే ప్రపంచ కప్పులో టైటిల్ ఫేవరెట్ కాదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ లైనప్ ను చూస్తే భారత్ ప్రపంచ కప్పు గెలవడం కష్టమేనని మైఖేల్ వాన్ అన్నారు. భారత బ్యాటింగ్ లైనప్ లో లోపాలున్నాయని అన్నారు. అంతే కాకుండా భారత జట్టు ఇప్పుడున్న పరిస్థతి మెరుగు కావాలంటే పలు సూచనలు చేశారు ఈ మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు.
బౌలింగ్ మరింత పటిష్టం కావాలి…
ఆసీస్ సిరీస్ లో పరుగుల వరద పారుతున్న నేపథ్యంలో భారత్ బౌలింగ్ సైతం బలోపేతం కావాలని మైఖేల్ వాన్ అన్నారు. ఆరో బౌలర్ అవసరమని తెలిపారు. వీలైతే బౌలింగ్ చేయగలిగే, ఏడో బౌలర్ అయ్యే ఆటగాన్ని టీంలోకి తీసుకోవాలని సూచించారు. ప్రపంచ కప్పుకు సమయం ఉన్న నేపథ్యంలో భారత్ ఆల్ రౌండర్ల జట్టులోకి తీసుకోవాలని తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసే ఆటగాళ్లు భారత్ కు అవసరమని విశ్లేషించారు. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తే భారత్ ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కవచ్చని సలహా ఇచ్చారు.