T20 WORLD CUP: టీమిండియాపై ప్రముఖుల ప్రశంసల జల్లు.. ఒక రోజు ముందే వచ్చిన దీపావళి అంటూ..

|

Oct 23, 2022 | 6:56 PM

చివరి క్షణం వరకు ఉత్కంఠ.. గెలుపు నీదా.. నాదా అని చివరి బంతి వరకు జరిగిన టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సూపర్-12లో ఆదివారం జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిరాశకు గురైన భారత..

T20 WORLD CUP: టీమిండియాపై ప్రముఖుల ప్రశంసల జల్లు.. ఒక రోజు ముందే వచ్చిన దీపావళి అంటూ..
Virat Kohli Winning Moment
Follow us on

చివరి క్షణం వరకు ఉత్కంఠ.. గెలుపు నీదా.. నాదా అని చివరి బంతి వరకు జరిగిన టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సూపర్-12లో ఆదివారం జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిరాశకు గురైన భారత క్రికెట్ అభిమానుల్లో ఒక్కసారిగా ఎనలేని ఉత్సహం. మాజీ సారధి విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే. అసలు గెలుస్తుందా లేదా అనుకున్న మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత క్రికెట్ జట్టు ఆడిన మొదటి మ్యాచ్ లో జయకేతనం ఎగరవేయడంతో పలువురు ప్రముఖులు భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు, మాజీ క్రికెటర్లు సైతం టీమిండియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై కూడా పలువురు ప్రంశసలు కురిపించారు. భారత్ ఓడిపోతుందనే నిరాశలో చాలామంది ఉన్నారు. అయితే 18వ ఓవర్ లో 17 పరుగులు రావడంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే 19వ ఓవర్ లో తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే రావడంతో భారత క్రికెట్ అభిమానుల్లో మళ్లీ నిరాశ.. ఏం జరుగుతుందో అర్థం కావడంలేదు. అయితే 19వ ఓవర్ ఐదో బంతి, ఆరో బంతికి వరుసగా రెండు సిక్స్ లు కొట్టడంతో.. మళ్లీ ఉత్సాహం. చివరి ఓవర్ లో గెలుపు కోసం భారత్ 16 పరుగులు కొట్టాలి. 20వ ఒవర్ మొదటి బంతికి హర్థిక్ పాండ్యా ఔటయ్యాడు.

టెన్షన్.. టెన్షన్ భారత్ గెలవదేమోననే అనుమానం.. రెండో బంతికి సింగిల్ రాగా, మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. మూడు బంతుల్లో 13 పరుగులు కొట్టాలి. నాలుగో బంతి ఏం జరుగుతందోననే టెన్షన్.. అయితే ఆ బాల్ ను బౌలర్ మహ్మద్ నవాజ్ నోబ్ వేయగా ఆ బంతిని కోహ్లీ సిక్స్ కొట్టాడు. దీంతో భారత్ విజయం పక్కా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. తరువాత బంతి వైడ్ గా వేయడంతో.. ఆ తర్వాత బాల్ కు మూడు పరుగులు చేశారు. రెండు బంతుల్లో రెండు పరుగులు కొట్టాల్సిన సమయంలో ఐదో బంతికి దినేష్ కార్తీక్ అవుటయ్యాడు. మరోసారి టెన్షన్.. చివరి బంతికి రెండు పరుగులు కొట్టాలి. అయితే ఆరో బాల్ ను వైడ్ గా వేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సహం కనబడింది. చివరి బంతికి విజయం కోసం ఒక పరుగు కొట్టాల్సి ఉండగా.. రవిచంద్ర అశ్విన్ సింగిల్ తీయడంతో ఉత్కంఠ పోరులో భారత్ గెలుపొందింది.

ఇవి కూడా చదవండి

దీపావళి ప్రారంభమైంది: అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి

టీమిండియా విజయం పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. టీ20 ప్రపంచకప్ ను భారత్ విజయంతో ప్రారంభించిందని, ఈ విజయంతో దీపావళి ప్రారంభమైందని ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీది వాట్ ఎ ఇన్నింగ్స్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

టీమిండియాకు బీసీసీఐ శుభాకాంక్షలు

బీసీసీఐ కూడా భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి టర్నింగ్ బ్యాక్ టైమ్ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఫామ్ లోకి వచ్చి ఈ మ్యాచ్ లో తన నైపుణ్యాన్ని చూపించాడని, అతడి సామర్థ్యానికి ఈరోజు సాక్ష్యమంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపింది.

హ్యాపీ దీపావళి అన్న మాజీ క్రికెటర్లు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పాకిస్తాన్ పై భారత్ గెలువడంపై ట్విట్టర్ లో స్పందించారు. T20 ప్రపంచకప్ ను భారత్ బాగా ప్రారంభించిందని, ఈ గేమ్ ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చిందని ట్వీట్ చేశారు. జట్టు సమిష్టి కృషితో, జట్టు సభ్యుల కీలకమైన సహకారంతో భారత్ విజయం సాధించిందన్నారు. విరాట్‌ కోహ్లీ, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు టెండూల్కర్.

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా భారత్ గెలుపుపై స్పందించారు. హ్యాపీ దీపావళి అంటూ ట్వీట్ చేశారు. వాట్ యాన్ అమైజింగ్ గేమ్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. హై ఎమెషన్స్ తో కూడుకున్నదని, తాను బ్రిలియంట్ టీ20 ఇన్నింగ్స్ ను చూశాను.. చక్ దే ఇండియా అంటూ ట్వీట్ చేశారు సెవ్వాగ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..