CWG 2022: బూట్లు కొనలేని స్థితి నుంచి బర్మింగ్ హామ్‌ దాకా.. బింద్యారాణి విజయం వెనక ఎవరున్నారంటే?

|

Jul 31, 2022 | 11:57 AM

BindiyaRani Devi: కామన్వెల్త్ క్రీడల్లో 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి (BindiyaRani Devi) కూడా సిల్వర్‌ మెడల్‌ గెల్చుకుంది. ఈమె కేవలం ఒక కిలో తేడాతో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది.

CWG 2022: బూట్లు కొనలేని స్థితి నుంచి బర్మింగ్ హామ్‌ దాకా.. బింద్యారాణి విజయం వెనక ఎవరున్నారంటే?
Mirabai Chanu And Bindiyara
Follow us on

BindiyaRani Devi: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో రెండోరోజు భారత్‌కు పతకాల పంట పండింది. శనివారం ఏకంగా నలుగురు భారత క్రీడాకారులు పతకాలు గెల్చుకున్నారు. ఇవన్నీ వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో వచ్చినవే. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను 49 కిలోల వెయిట్ విభాగంలో స్వర్ణం సాధించగా.. అంతకుముందు సంకేత్ మహదేవ్, గురురాజ పూజారి వరుసగా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఇక చివరిగా 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి (BindiyaRani Devi) కూడా సిల్వర్‌ మెడల్‌ గెల్చుకుంది. ఈమె కేవలం ఒక కిలో తేడాతో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది.

మీరాబాయి 2.0
కాగా బింద్యారాణి, బంగారు మీరాబాయి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచే వచ్చారు. అంతే కాకుండా ఇద్దరూ ఒకే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కుటుంబ నేపథ్యం కూడా దాదాపు సేమ్‌. అందుకే చాలా మంది 23 ఏళ్ల బింద్యారాణిని మీరాబాయి చాను 2.0 అని పిలుస్తారు. ఇదే విషయంపై ఓ సందర్భంలో మాట్లాడిన ఈ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయే తనకు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చింది. ‘ నేను చానూను చూస్తూ పెరిగాను. ఆమె నా విజయానికి ఎంతో దోహదపడ్డారు. టెక్నిక్‌, ట్రైనింగ్‌ పరంగా నాకు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చి నా ఆటతీరును మెరుగుపర్చింది. ఇక నేను ట్రైనింగ్‌ క్యాంప్‌కి కొత్తగా వచ్చినప్పుడు, ఆమె నన్ను బాగా చూసుకుంది. నా దగ్గర షూస్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని తెలుసుకుని తన షూస్‌ ఇచ్చేసింది. ఆమె ఎప్పుడూ నాకు స్ఫూర్తిదాయకమే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆమెకు నేను పెద్ద అభిమానిని’ అని బింద్యా రాణి పేర్కొంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..