శాస్త్రి, సచిన్‌ వికెట్లతో గ్రాండ్‌గా అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్.. కట్ చేస్తే.. నెల రోజుల్లోనే కెరీర్ క్లోజ్..

మార్క్ బర్మెస్టర్ తన చిన్న కెరీర్‌లోనే రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, డీన్ జోన్స్‌లకు చుక్కలు చూపించాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాడు.

శాస్త్రి, సచిన్‌ వికెట్లతో గ్రాండ్‌గా అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్.. కట్ చేస్తే.. నెల రోజుల్లోనే కెరీర్ క్లోజ్..
Ravi Shastri On This Day
Follow us

|

Updated on: Jan 24, 2023 | 11:13 AM

ప్రపంచంలోని ప్రతి బౌలర్ కల తన మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయడమే. ఇక స్వదేశంలో అరంగేంట్ర చేస్తే.. ప్రత్యేకత చూపించాలని కోరుకుంటాడు. ఇక అదే మ్యాచ్‌లో పేరుగాంచిన స్టార్ ప్లేయర్లు ఉంటే, చరిత్రలో తన పేరు నమోదు చేసుకోవడానికి ఏ ఆటగాడికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదనడంలో ఎలాంటి సందేహం ఉండదు. జింబాబ్వేకు చెందిన మార్క్ బర్మెస్టర్‌కు కూడా ఇలానే ఊహించుకున్నాడు. అలాంటి ప్రదర్శనలతోనే తన దేశానికి స్టార్ అయ్యాడు. అయితే ఇంత జరిగినా.. అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేకపోవడం గమనార్హం.

రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, డీన్ జోన్స్ వంటి గొప్ప ఆటగాళ్లను పెవిలియన్ చేర్చిన మార్క్ ఈరోజు తన 55వ పుట్టినరోజు చేసుకుంటున్నాడు. 1968 జనవరి 24న దక్షిణాఫ్రికాలో జన్మించిన మార్క్ జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 1992 ప్రపంచ కప్‌కు జింబాబ్వే జట్టులో ఎంపికైన మార్క్.. ప్రపంచాన్ని శాసించేలా తయారయ్యాడు. ప్రపంచ కప్‌లో ఆడిన 4 మ్యాచ్‌లలో సచిన్ టెండూల్కర్, డీన్ జోన్స్‌లను అవుట్ చేశాడు.

జింబాబ్వే నుంచి టెస్టు వికెట్‌ తీసిన తొలి ఆటగాడు..

మార్క్ జింబాబ్వే మొదటి టెస్ట్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. జింబాబ్వే 1992లో మాత్రమే టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. భారత్‌తో తన మొదటి టెస్ట్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టెస్టు వికెట్‌ తీసిన తొలి జింబాబ్వే ఆటగాడిగా మార్క్‌ నిలిచాడు. రవిశాస్త్రిని ఔట్ చేయడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. అదేంటంటే శాస్త్రిని డిస్మిస్ చేస్తూనే మార్క్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శాస్త్రి 11 పరుగులకు మించి వెళ్లేందుకు మార్క్ అనుమతించలేదు. కిరణ్ మోరే, అనిల్ కుంబ్లే వికెట్లను కూడా పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

కెరీర్‌ను దెబ్బతీసిన గాయం..

మార్క్ టెస్ట్ కెరీర్ ప్రారంభమై ఒక నెలలోనే ముగిసింది. జింబాబ్వే తరపున 3 టెస్టు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టి 54 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతని వన్డే కెరీర్ 1992 నుంచి 1995 వరకు కొనసాగింది. ఈ సమయంలో, అతను 8 వన్డేల్లో 5 వికెట్లు పడగొట్టాడు. 109 పరుగులు చేశాడు. వెన్ను గాయం కారణంగా, అతను దాదాపు 2 సీజన్లలో బౌలింగ్ చేయలేదు. అతను తిరిగి ఫిట్‌గా ఉన్నప్పుడు, సెలెక్టర్లు అతని పేరును దాదాపు మర్చిపోయారు. దీంతో మార్క్ కెరీర్ ముగిసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..