Watch Video: ఓ బంతి కోసం నలుగురు ఫీల్డర్ల పరుగులు.. బౌండరీ లైన్లో నవ్వులు పూయిస్తోన్న వీడియో..
మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాటింగ్ సమయంలో, మైఖేల్ నెజర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఓవర్ తొలి బంతికే థామస్ రోజర్స్ అద్భుతమైన షాట్ ఆడి బంతిని బౌండరీ వైపు పంపాడు.
ప్రస్తుతం, బిగ్ బాష్ లీగ్ (BBL) 12వ సీజన్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. చివరి దశకు చేరుకుంటుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో అభిమానులు ఎన్నో అద్భుతమైన గేమ్స్ చూశారు. దీంతో పాటు కొందరు ఆటగాళ్లు తమ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి మనసులు గెలుచుకున్నారు. టోర్నీలో నిన్న జరిగిన 51వ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌తో బ్రిస్బేన్ హీట్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సీన్ కనిపించడంతో వ్యాఖ్యాతలతో పాటు అభిమానులంతా తెగ నవ్వుకున్నారు.
మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాటింగ్ సమయంలో, మైఖేల్ నెజర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఓవర్ తొలి బంతికే థామస్ రోజర్స్ అద్భుతమైన షాట్ ఆడి బంతిని బౌండరీ వైపు పంపాడు. ఇంతలో, బంతిని ఆపడానికి నలుగురు ఆటగాళ్ళు ఒకేసారి వెంబడించడం కనిపించింది. చివరగా ఒక ఫీల్డర్ బంతిని విజయవంతంగా అడ్డుకున్నాడు. మరొక ఫీల్డర్ దానిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిగ్ బాష్ లీగ్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.
వైరల్ వీడియో..
How about this for fielding in numbers ??@KFCAustralia #BucketMoment #BBL12 pic.twitter.com/MRH7EYHXak
— KFC Big Bash League (@BBL) January 22, 2023
బ్రిస్బేన్ హీట్ ఉత్కంఠ విజయం..
ఇరు జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో బ్రిస్బేన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ శామ్ హాన్ (73*), జిమ్మీ పియర్సన్ (57*) ధాటికి తుఫాను ఇన్నింగ్స్‌ల సాయంతో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం మెల్బోర్న్ జట్టు బ్యాట్స్‌మెన్ కూడా మంచి ఆటతీరును కనబరిచారు. మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్ 4 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
ఈ సీజన్‌లో బ్రిస్బేన్‌కి ఇది ఆరో విజయం. బ్రిస్బేన్ హీట్ 13 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచి 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..