Watch Video: తన అభిమాన ప్లేయర్‌ నుంచి ప్రత్యేక సందేశం అందుకున్న వెంకటేష్ అయ్యర్.. ఆ స్టార్ ఎవరో తెలుసా?

వెంకటేష్ అయ్యర్ గత సీజన్‌లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

Watch Video: తన అభిమాన ప్లేయర్‌ నుంచి ప్రత్యేక సందేశం అందుకున్న వెంకటేష్ అయ్యర్.. ఆ స్టార్ ఎవరో తెలుసా?
Ipl 2022 Venkatesh Iyer, Csk Vs Kkr

Updated on: Mar 25, 2022 | 9:04 PM

ఐపీఎల్ 2022 (IPL 2022) ప్రారంభానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుత ఐపీఎల్‌లో భాగంగా శనివారం తొలి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ప్రస్తుత విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లూ టైటిల్ గెలవాలని చూస్తున్నాయి. తొలి మ్యాచ్‌ను విజయంతో ప్రారంభించాలనుకుంటున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌(Venkatesh Iyer) కు ఓ ప్రత్యేక సందేశం వచ్చింది. ఆశ్చర్యకరంగా, అతనికి ఈ సందేశం భారతదేశం నుంచి లేదా ఏ క్రికెటర్ నుంచి కాదు. వెంకటేష్‌కి ఈ సందేశం పంపిన వ్యక్తి పేరు WWE రెజ్లర్ రోలిన్స్ (WWE Wrestler Rollins).

IPL-2022 కోసం KKR వెంకటేష్ అయ్యర్‌ను రిటైన్ చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో బలమైన బ్యాటింగ్‌ చేసి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో అయ్యర్ సత్తా చాటాడు. ఈసారి కూడా వెంకటేష్ అదే ఫామ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు.

WWE ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోను రోలిన్స్ విడుదల చేసింది. ఇందులో వెంకటేష్‌కి మెసేజ్ ఇస్తూ రోలిన్స్, “వెంకటేష్… మై ఫ్రెండ్. నేను సేత్ ఫ్రీకిన్ రోలిన్స్. మీరు నా అభిమాని కావడంలో ఆశ్చర్యం లేదు. నా మిత్రమా, ఇది మంచి విషయం. అయితే ప్రస్తుతం మీ ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది. అందుకే ఈ కప్ గెలవడానికి మీకు నా ప్రార్థనలు అవసరం. ఐపీఎల్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కష్టపడి ఆడు” అని సందేశం పంపించాడు

కేవలం 10 మ్యాచ్‌ల్లోనే..

మరోసారి అందరి దృష్టి వెంకటేష్‌పైనే ఉంటుంది. అతను గత సీజన్‌లో కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇప్పటి వరకు ఆడిన 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేశాడు. 10 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో 50 మార్కును దాటగలిగాడు.బంతితో అద్భుతాలు చేసే సత్తా ఉన్న వెంకటేష్ ఐపీఎల్‌లో మూడు వికెట్లు కూడా పడగొట్టాడు.

Also Read: IPL 2022: మొదటి మ్యాచ్‌లో స్పెషల్ రికార్డులపై కన్నేసిన చెన్నై, కోల్‌కతా ఆటగాళ్లు.. లిస్టులో ఎవరున్నారంటే?

IPL 2022: స్పెషల్ రికార్డ్‌కు 65 పరుగుల దూరంలో చెన్నై మాజీ సారథి.. ఆ లిస్టులో ఎవరు ముందున్నారంటే?