భారత్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా జూన్ 7న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) జరగనుంది. రోహిత్ సారధ్యంలోని టీమిండియా, ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్‌కు 5గురు టీమిండియా ప్లేయర్స్ వీడ్కోలు పలకనున్నారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్‌కు 37 ఏళ్లు. దాదాపుగా రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాడు. అటు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో మంచి ఆటతీరు కనబరుస్తుండటంతో.. ఇటు యువ ప్లేయర్స్‌కు కూడా ఛాన్స్‌లు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. వెరిసి WTC ఫైనల్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ జాబితాలోకి వచ్చే మరో ఆటగాడు ఇషాంత్ శర్మ. మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ వంటి పేసర్ల కారణంగా జాతీయ జట్టులోఇషాంత్ శర్మకు అవకాశాలు రావట్లేదు. అతడు చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడాడు. ఇక ఇప్పుడు ఇషాంత్ శర్మ టెస్టు ఫార్మాట్‌లో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యం. అందుకే, WTC ఫైనల్ తర్వాత ఇషాంత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్ అయ్యే ఛాన్స్ ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్ కావడంతో.. సూర్యకుమార్ యాదవ్ జట్టులో భాగం కావచ్చు. అయితే, అతడి టీ20ల ఫామ్ పోలిస్తే సుదీర్ఘ ఫార్మాట్లలో సరిగ్గా లేదు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ WTC ఫైనల్‌లో మంచి ప్రదర్శన కనబరచకపోతే.. అతడు టెస్ట్‌లకు వీడ్కోలు పలికి, T20I, ODIలకు మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది.
WTC ఫైనల్ తర్వాత టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోగల మరో ఆటగాడు వృద్ధిమాన్ సాహా. రిషబ్ పంత్ గాయపడినప్పటికీ, వికెట్ కీపర్‌గా సాహాను టెస్టు జట్టులోకి తిరిగి తీసుకోలేదు. అటు సెలెక్టర్లు, కోచ్ టెస్ట్‌ల్లో కీపర్ స్థానాన్ని.. యువ వికెట్ కీపర్‌తో భర్తీ చేస్తామని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే సాహా టెస్టు జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం లేదు. అందువల్ల, అతడు WTC ఫైనల్ తర్వాత టెస్ట్‌ల నుంచి రిటైర్ కావొచ్చు.
WTC ఫైనల్ తర్వాత టెస్టుల నుంచి రిటైర్ అయ్యే మరో ఆటగాడు ఉమేష్ యాదవ్ . స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు మంచి ఫామ్‌ను కనబరిచాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టులో కూడా భాగం కావచ్చు. అయితే, యాదవ్‌కి ఇప్పటికే 35 సంవత్సరాలు. తదుపరి WTC సైకిల్‌లో మాత్రం అతడు ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడే అవకాశాలు లేవు. ఇప్పటికే ఉమ్రాన్ మాలిక్ లాంటి యువ పేసర్లు టెస్టుల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితంగా, ప్రస్తుత టెస్ట్ ఛాంపియన్‌షిప్ తర్వాత యాదవ్ టెస్టుల నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది.