WTC Final: ‘ఇలా చేస్తే టీమిండియాదే విజయం.. 4వ రోజు ఆట మలుపు తిరగవచ్చు’..

ఓవల్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌ తొలిరోజు ముగిసే సమయానికి ఎవరు గెలుస్తారంటే..

WTC Final: ఇలా చేస్తే టీమిండియాదే విజయం.. 4వ రోజు ఆట మలుపు తిరగవచ్చు..
Wtc Final 2023 Aus Vs Ind

Updated on: Jun 10, 2023 | 9:44 AM

ఓవల్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌ తొలిరోజు ముగిసే సమయానికి ఎవరు గెలుస్తారంటే.. కచ్చితంగా ఆస్ట్రేలియా అనే చెప్పారు. కానీ మూడవ రోజు ఆఖరికి అభిప్రాయం మారిపోయింది. రాబోయే రెండు రోజుల్లో ఇరు జట్ల విజయావకాశాలు 50-50 శాతంగా మారాయి. అంతేకాదు నాలుగో రోజు ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేస్తే.. టీమిండియా గెలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ మెరుపులు.. అనంతరం రవీంద్ర జడేజా బౌలింగ్ మ్యాజిక్‌తో భారత్ ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పుంజుకుందని చెప్పాలి. తొలుత టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా.. వరుస వికెట్లు తీస్తూ ఆట ముగిసే సమయానికి కట్టడి చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఆసీస్ 123 పరుగులకు 4 వికెట్లు చేజార్చుకుంది.

నాలుగో రోజు, మార్నస్ లబూషెన్, కామెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఈ ఇద్దరూ మొదటి సెషన్‌లో ఎటువంటి వికెట్ కోల్పోకుండా గరిష్టంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారు. అదే జరిగితే ఆసీస్ భారీ ఆధిక్యాన్ని అందుకోవడం ఖాయం. అందుకే ఫోర్ట్ డే ఫస్ట్ సెషన్ చాలా ముఖ్యం. టీమిండియా ఈ సమయంలో వికెట్లు పడగొడితే.. మ్యాచ్ మనదే.

పిచ్‌ బౌన్స్‌కు సహకరించడం తక్కువగా.. స్పిన్నర్లకు సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే జడేజా బౌలింగ్‌లో స్పష్టమైన టర్న్ కనిపించింది. అందుకే నాలుగో రోజు తొలి సెషన్‌లో కనీసం మార్నస్‌ లబూషెన్‌ వికెట్‌ పడగొట్టడం అత్యంత కీలకం. అలా జరగకపోయినా టైట్ బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేయవచ్చు. 350-375 ఆధిక్యంతో ఆస్ట్రేలియాను నిలువరించడంలో భారత బౌలర్లు సఫలమైతే, మిగిలిన ఒకటిన్నర రోజుల్లో జట్టు విజయాన్ని ఈజీగా అందుకోవచ్చు. అలాగే నాలుగో రోజు ముగిసే సమయానికి భారత్ బ్యాటింగ్‌ చేస్తే.. వికెట్లు కూడా పడకుండా చూసుకోవడం అత్యంత కీలకం. అప్పుడే మ్యాచ్‌ని గెలవడానికి లేదా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.