IND vs AUS: ‘టెస్ట్ ఫైనల్‌’ ప్రారంభానికి ముందే భారత్‌కు ఎదురుదెబ్బ.. ఆందోళనలో టీమిండియా.! కారణం ఏమిటంటే..?

|

Jun 05, 2023 | 6:03 PM

Team India, WTC Final 2023: భారత క్రికెట్ జట్టును మరోసారి గాయలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ఇంకా 2 రోజులే ఉంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న..

IND vs AUS: ‘టెస్ట్ ఫైనల్‌’ ప్రారంభానికి ముందే భారత్‌కు ఎదురుదెబ్బ.. ఆందోళనలో టీమిండియా.! కారణం ఏమిటంటే..?
Ishan Kishan Injury Ahead of WTC Final
Follow us on

Team India, WTC Final 2023: భారత క్రికెట్ జట్టును మరోసారి గాయలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ఇంకా 2 రోజులే ఉంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ భారత్ జట్టులోని కీలక ఆటగాడు గాయపడ్డాడు. అవును, భారత యువ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్‌ భాగంగా నెట్‌ బౌలర్‌ అంకిత్‌ చౌదరీ వేసిన బంతి కిషన్‌ చేతికి బలంగా తాకింది. ఫలితంగా నొప్పితో విలావిల్లాడిన ఇషాన్‌ ఆ తర్వాతి ప్రాక్టీస్‌‌లో పాల్గొనలేదు.

ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం తలపడే భారత జట్టులో వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్, తెలుగు ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ మధ్య భీకర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో భరత్‌కి తుదిజట్టులో స్థానం ఇవ్వాలని కొందరు మాజీలు అభిప్రాయపడుతుండగా.. ఇషాన్‌కి అనుభవం ఉందని, అతన్నే వికెట్ కీపర్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయిన గాయం కారణంగా తుది జట్టు ఎంపికలకు ఇషాన్ అందుబాటులో ఉండకపోతే.. భరత్‌కి టీమ్‌లో స్థానం ఖారారైనట్లే. కాగా, గాయం కారణంగా రిషభ్ పంత్, జస్ప్రీత్‌ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆగగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం టీమిండియా స్క్వాడ్:

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

ఇవి కూడా చదవండి

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..