WTC Final 2023: అరంగేట్రంలోనే 7 వికెట్లతో టీమిండియాకు చుక్కలు.. కట్‌చేస్తే.. డబ్ల్యూటీసీలో రోహిత్ సేనను అతడే విలన్?

|

Jun 02, 2023 | 9:32 AM

India Vs Australia: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ మైదానంలో జూన్‌ 7 నుంచి భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య ఈ ఫైనల్ జరగనుంది. ఈ కీలక పోరుకు ఇరు జట్లు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. కాగా, భారత్‌కి ఇది వరుసగా 2వ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్.

WTC Final 2023: అరంగేట్రంలోనే 7 వికెట్లతో టీమిండియాకు చుక్కలు.. కట్‌చేస్తే.. డబ్ల్యూటీసీలో రోహిత్ సేనను అతడే విలన్?
Wtc Final 2023 Ind Vs Aus
Follow us on

WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ మైదానంలో జూన్‌ 7 నుంచి భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య ఈ ఫైనల్ జరగనుంది. ఈ కీలక పోరుకు ఇరు జట్లు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. కాగా, భారత్‌కి ఇది వరుసగా 2వ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్. WTC 2021 ఫైనల్‌కు చేరిన టీమిండియాకు న్యూజిలాండ్ షాకిచ్చి, ప్రపంచ విజేతగా నిలిచింది.

ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది. అయితే టీమిండియా ఈ కలను ఆస్ట్రేలియా యువ బౌలర్ అడ్డుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 22 ఏళ్ల యువ స్పిన్నర్ ఇప్పటికే టీమ్ ఇండియా ముందు తన సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రుజువైంది.

ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ భారతదేశంలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులో టాడ్ 7 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. 1882 తర్వాత ఆస్ట్రేలియా తరపున 5 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన స్పిన్నర్‌గా నిలిచాడు. టీమిండియాతో జరిగిన సిరీస్‌లోనూ 14 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు టాడ్ మర్ఫీ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్‌కు అద్భుతమైన సహకారం అందించేందుకు రెడీ అయ్యాడు. ఓవల్ మైదానం స్పిన్నర్లకు ఉపయోగపడుతుందని స్టీవ్ స్మిత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ స్పిన్ ద్వయంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగులుతుందన్న విశ్వాసంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది.

తద్వారా ఓవల్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ల ఆటగాళ్ల నుంచి ఉత్కంఠభరితమైన పోటీని ఆశించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా, యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ నుంచి అద్భుతమైన స్పిన్ మాయాజాలం చూడొచ్చని తెలుస్తోంది.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కెమెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ , స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..