IND Vs ENG: ఉప్పల్‌లో ‘బజ్ బాల్’‌కు దబిది దిబిదే.. టీమిండియాకి ఆ ముగ్గురే దిక్కు.. ఎవరంటే.?

చాన్నాళ్ల తర్వాత.. హైదరాబాద్‌లో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. టీమిండియాకు ఎంతో కలిసొచ్చిన ఉప్పల్ స్టేడియంలో మరో విక్టరీ కోసం రెడీ అయింది రోహిత్ సేన. మరి ఒకసారి టీమిండియా రికార్డులు, గ్రౌండ్ ప్రత్యేకతలు, క్రికెటర్ల మైల్‌స్టోన్స్ ఏంటో చూసేద్దామా..

IND Vs ENG: ఉప్పల్‌లో బజ్ బాల్‌కు దబిది దిబిదే.. టీమిండియాకి ఆ ముగ్గురే దిక్కు.. ఎవరంటే.?
India Vs England

Updated on: Jan 23, 2024 | 10:00 AM

చాన్నాళ్ల తర్వాత.. హైదరాబాద్‌లో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. టీమిండియాకు ఎంతో కలిసొచ్చిన ఉప్పల్ స్టేడియంలో మరో విక్టరీ కోసం రెడీ అయింది రోహిత్ సేన. మరి ఒకసారి టీమిండియా రికార్డులు, గ్రౌండ్ ప్రత్యేకతలు, క్రికెటర్ల మైల్‌స్టోన్స్ ఏంటో చూసేద్దామా..

ప్రపంచ క్రికెట్లో దిగ్గజ టీమ్స్ భారత్‌-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జనవరి 25వ తేదీ నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభ కానుంది. మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్. ఉప్పల్‌లో మ్యాచ్‌ అంటే భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. ఉప్పల్ స్టేడియంలో ఓటమి ఎరుగని టీమ్‌గా భారత్‌కు ట్రాక్ రికార్డ్ ఉంది. ఉప్పల్‌లో ఇప్పటివరకూ అయిదు టెస్టులాడిన టీమ్‌ఇండియా నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉప్పల్‌ గ్రౌండ్ ప్రత్యేకం. టెస్టుల్లో 379 పరుగులు చేశాడు. ఓ డబుల్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు విరాట్. తనకు అచ్చొచ్చిన ఉప్పల్‌లో విరాట్ ఈసారి మ్యాచ్‌ ఆడటం లేదు. వెటరన్‌ టెస్టు బ్యాటర్‌ పుజారాకు ఇక్కడ గొప్ప రికార్డు ఉంది. పుజారా సైతం ఇక్కడ డబుల్ సెంచరీ చేశాడు. బౌలింగ్‌లో చూసుకుంటే ఉప్పల్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకూ టెస్టుల్లో ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే. అశ్విన్, జడేజా, ప్రజ్ఞాన్ ఓజా, ఉమేష్‌ యాదవ్, హర్భజన్‌కు ఉప్పల్ అచ్చొచ్చిన గ్రౌండ్. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లోనూ.. భారత్‌ విజయఢంకా మోగించాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

మొదటి టెస్టుకు భారత జట్టు అంచనా:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రీకర్ భరత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్