కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకు ముందు సెంచూరియన్ ఆతిథ్యమిచ్చిన తొలి టెస్టులో చిత్తుగా ఓడడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది. అయితే సఫారీలను దెబ్బకు దెబ్బ తీసి కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దీంతో WTC పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది భారత జట్టు. కేప్ టౌన్ టెస్టులో విజయంతో భారత్ ఖాతాలో మొత్తం 12 పాయింట్లు చేరాయి. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత 54.16 PCT పాయింట్లతో భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ 50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి
ఈ నెలాఖరులో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్ 5-0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే ఫైనల్ స్థానం దాదాపు ఖాయం. అయితే అదంత సులభమేమీ కాదు. మరోవైపు దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ పర్యటనకు బయలు దేరనుంది. కాబట్టి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టాప్ ప్లేస్ దోబూచులాడుతోంది. కేప్ టౌన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా బౌలర్లు పిచ్‌ను సద్వినియోగం చేసుకుని దక్షిణాఫ్రికా జట్టు మొత్తాన్ని 55 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ తర్వాత టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. ఆశ్చర్యకరంగా తొలిరోజు మొత్తం 23 వికెట్లు పడ్డాయి. ఇక రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 176 పరుగులు మాత్రమే చేసి భారత్ కు 79 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ను మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది రోహిత్ సేన.
The Points Table of WTC 2023-25:
1. India – 54.16%
2. South Africa – 50.0%
3. New Zealand – 50.0%
4. Australia – 50.0%
5. Bangladesh – 50.0%– Team India is back at the Top…!!!! 🇮🇳 pic.twitter.com/M6aX2g5BZI
— CricketMAN2 (@ImTanujSingh) January 4, 2024
Congratulations #TeamIndia for levelling the series against South Africa. Our bowlers capitalized on the favorable conditions, with @mdsirajofficial delivering a ruthless performance, securing a 7-wicket haul in the match. @jaspritb1 was clinical in the second innings, ending… pic.twitter.com/U42BOdkx2s
— Jay Shah (@JayShah) January 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..