కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆటపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. వృద్ధిమాన్ సాహా అంతిమ పోరాట యోధుడు అంటూ పొగిడారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించేందుకు 280 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ 7 వికెట్ల నష్టానికి 234 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. సాహా 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో సాహాకు ఇది ఆరో అర్ధసెంచరీ. 2017 ఆగస్ట్ తర్వాత మొదటిసారిగా హాఫ్ సెంచరీ చేశాడు. మెడ నొప్పి వచ్చినా 37 ఏళ్ల అతను బ్యాటింగ్ చేశాడు.
“వృద్ధిమాన్ సాహా అంతిమ పోరాట యోధుడు.” అని లక్ష్మణ్ అన్నాడు. లక్ష్మణఅ కొన్ని సంవత్సరాలుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో సాహాతో సన్నిహితంగా పని ఉన్నాడు. సాహా, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ (32)ల సహకారంతో ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ చేసింది. కైల్ జెమీసన్ (3-40), టిమ్ సౌథీ (3-75) వికెట్లు పడగొట్టారు. నాలుగో రోజు మొదటి సెషన్‌లో 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్‌ను అయ్యర్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతనికి అశ్విన్, సహా మంచి సహకారం అందించారు. అయ్యర్ ఆరో, ఏడో వికెట్‌కు వరుసగా అశ్విన్, సాహాతో కలిసి 50-ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్, బ్యాడ్ లైట్ ఆట ఆగిపోయే సమయానికి ఒక వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది.