
మహిళల ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్‌లో గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నమెంట్‌లోని 15వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన యూపీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కష్టమవుతుందని గుజరాత్ ముందుగానే అంచనా వేసింది. అందువల్ల, ఆ జట్టు పెద్ద స్కోరు సాధించాలనే ఉద్దేశ్యంతో మైదానంలోకి దిగింది. బెత్ మూనీ యూపీ బౌలర్లను భయాందోళనకు గురిచేసింది. దయాళన్ హేమలతను త్వరగా ఔటైనా బెత్ మూనీ, హర్లీన్ డియోల్ రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బెత్ మూనీ 59 బంతుల్లో 17 ఫోర్లతో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె కేవలం 4 పరుగుల తేడాతో తన సెంచరీని మిస్ చేసుకుంది. మూనీ ఇన్నింగ్స్ తో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
187 పరుగుల లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ ప్లేయర్లు ఘోరంగా విఫలమయ్యారు. గ్రేస్ హారిస్ 25 పరుగులు చేసింది. కానీ ఇతర బ్యాటర్లు పూర్తిగా నిరాశ పర్చారు. కిరణ్ నవ్‌గిరే (0), జార్జియా వోల్ (0), వృందా దినేష్ (1), దీప్తి శర్మ (6), శ్వేతా సెహ్రావత్ (5), ఉమా ఛెత్రి (17), చినెల్లే హెన్రీ (28), సోఫియా ఎక్లెస్టోన్ (14), గౌహర్ సుల్తానా (0). 17.1 ఓవర్లలో 105 పరుగులకే యూపీ వారియర్స్ అన్ని వికెట్లు కోల్పోయింది. దీంతో గుజరాత్ జెయింట్స్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది.
At the end of Match 1️⃣0️⃣ of #TATAWPL 2024, here’s how the Points Table stands! 🙌
Which position is your favourite team on currently? 🤔 pic.twitter.com/dUDW7q1lcn
— Women’s Premier League (WPL) (@wplt20) March 3, 2024
కిరణ్ నవ్‌గిరే, జార్జియా వాల్, వృందా దినేష్, దీప్తి శర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, గ్రేస్ హారిస్, చినాల్ హెన్రీ, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, క్రాంతి గౌడ్, గౌహర్ సుల్తానా.
బెత్ మూనీ (వికెట్ కీపర్), దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డయాండ్రా డాటిన్, కశ్వి గౌతమ్, భారతి ఫుల్మాలి, మేఘనా సింగ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..