ఎవర్రా మీరంతా.. 10 మంది జీరోకే ఔట్.. 3 పరుగులకే ఆలౌట్.. క్రికెట్ పుట్టినింటిలో చెత్త రికార్డ్.. ఆ జట్టు ఏదంటే?
ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆడే ఇంగ్లాండ్ ప్రసిద్ధ కౌంటీ క్రికెట్ ఎంతో పేరుగాంచింది. ఈ లీగ్‌లో జట్టు చెషైర్ లీగ్ థర్డ్ డివిజన్‌లో కేవలం 3 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మూడు పరుగులలో ఒక పరుగు బ్యాట్ నుంచి వచ్చింది. అయితే, రెండు పరుగులు లెగ్ బై ద్వారా జట్టు ఖాతాలోకి చేరాయి.

ఒక జట్టు కేవలం మూడు పరుగులకే ఆలౌట్ కావడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు చాలా అరుదు లేదా దాదాపుగా చూసి ఉండరు. కానీ, ఈ అద్భుతమైన సంఘటన క్రికెట్ జన్మస్థలంగా పేరుగాంచిన ఇంగ్లాండ్‌లో జరిగింది. ఇక్కడ 11 మంది బ్యాటర్స్ కలిసి ఒక పరుగు మాత్రమే చేయడం గమనార్హం.
అది కూడా 11వ నంబర్ బ్యాటర్ ఒక్కడే ఒక్క పరుగు చేయడం గమనార్హం. కానీ, అతను తప్ప టాప్ 10 బ్యాటర్స్ తమ ఖాతా తెరవలేకపోయారు. ఈ చెత్త రికార్డును ఏ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సృష్టించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం జట్టు 3 పరుగులకే పరిమితం..
ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆడే ఇంగ్లాండ్ ప్రసిద్ధ కౌంటీ క్రికెట్ ఎంతో పేరుగాంచింది. ఈ లీగ్‌లో జట్టు చెషైర్ లీగ్ థర్డ్ డివిజన్‌లో కేవలం 3 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మూడు పరుగులలో ఒక పరుగు బ్యాట్ నుంచి వచ్చింది. అయితే, రెండు పరుగులు లెగ్ బై ద్వారా జట్టు ఖాతాలోకి చేరాయి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 2014లో హాస్లింగ్టన్ వర్సెస్ విర్రల్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగింది.
ఈ మ్యాచ్‌లో కొన్ని వింత సంఘటనలు జరిగాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, హాస్లింగ్టన్ మొదట బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డులో 108 పరుగులు చేసి, ప్రత్యర్థి జట్టుకు 20 ఓవర్లలో 109 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చింది. ప్రారంభంలో, ఈ లక్ష్యం విర్రల్ క్రికెట్ క్లబ్‌కు చాలా చిన్నదిగా భావించింది. కానీ, హాస్లింగ్టన్ బౌలర్లు బౌలింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చారు. విర్రల్ క్రికెట్ క్లబ్ మొత్తం జట్టును కేవలం మూడు పరుగులకే ఆలౌట్ చేశారు.
6 ఓవర్లలో 8 మంది బ్యాటర్స్ పెవిలియన్‌కు..
#3allout pic.twitter.com/ag8SMlfQxK
— Namitha Liyanage (@NamithaLiyanage) April 28, 2014
హాస్లింగ్టన్ ఇచ్చిన 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాల్ క్రికెట్ క్లబ్ మొదటి 6 ఓవర్లలోనే 8 మంది బ్యాటర్స్ వికెట్లు కోల్పోయింది. ఆశ్చర్యకరంగా ఈ బ్యాటర్స్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. లెగ్ బై ద్వారా జట్టు ఖాతా తెరవగా, మొదటి 10 మంది బ్యాటర్స్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు.
అదే సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోనర్ హాబ్సన్ ఒక్కడే ఒక పరుగు చేసి, నాటౌట్‌గా పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. 11వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న కోనర్ ఒక పరుగు సాధించడానికి ఏడు బంతులు ఎదుర్కొన్నాడు.
ఈ ఇంగ్లాండ్ కౌంటీ జట్లు 0 పరుగులకే ఔట్..
అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 3 పరుగులకే ఆలౌట్ అయింది. అలాగే 1913 సంవత్సరంలో, సోమర్సెట్ క్లబ్ లాంగ్‌పోర్ట్ 0 పరుగులకే పరిమితమైంది. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు 6 పరుగులు. ఈ రికార్డును 1810లో ఇంగ్లాండ్‌పై ది బి టీం సృష్టించింది.
The tweet from Wirral Cricket club at the bottom of this report is one of the best tweets I have ever seen! #3allout pic.twitter.com/iJvgTbv3pW
— Paul Bradshaw (@bradshaaaw) April 28, 2014
3 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత, విర్రల్ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియా ఖాతా X (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేసింది. దీనిలో వారు ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ మైఖేల్ వాఘన్, టీవీ వ్యాఖ్యాత డేవిడ్ లాయిడ్‌లను కోచింగ్ కోసం విజ్ఞప్తి చేశారు. విర్రల్ క్రికెట్ క్లబ్ మాజీ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను కూడా ట్యాగ్ చేసి కోచింగ్ చిట్కాలను అడిగారు. ఇందుకోసం వారు “We Need It” అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








