World Test Championship : నాలుగో స్థానానికి పడిపోయిన టీమిండియా.. మొదటి స్థానంలో ఇంగ్లాండ్

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఇప్పటివరకు టాప్ ప్లేస్ లో ఉన్న టీమిండియా ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్ ను కోల్పోయింది. చెన్నైలో జరిగిన టెస్టు ఓటమి టీమిండియాపై..

World Test Championship : నాలుగో స్థానానికి పడిపోయిన టీమిండియా.. మొదటి స్థానంలో ఇంగ్లాండ్
రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, పుజారా, కోహ్లీ, రహనే, విహారి, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్‌‌లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఎంపికైన 15 మంది సభ్యులు కాగా.. వీరిలో ఉమేష్ యాదవ్, సిరాజ్, సాహా, విహారిలు తుది జట్టులో ఉండరని సమాచారం.

Edited By:

Updated on: Feb 11, 2021 | 6:18 AM

World Test Championship : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ లో ఇప్పటివరకు టాప్ ప్లేస్ లో ఉన్న టీమిండియా ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్ ను కోల్పోయింది. చెన్నైలో జరిగిన టెస్టు ఓటమి టీమిండియాపై తీవ్ర ప్రభావమే చూపింది. ఇప్పటివరకు లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక చెన్నై టెస్ట్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ టీమ్ మొదటిస్థానానికి చేరుకుంది.

ఇక ఇంగ్లండ్‌ ఇప్పటిదాకా 11 సిరీస్ లు గెలవగా , 4 ఓటములు, 3 డ్రాలతో కలిపి 70.2 శాతం పాయింట్లతో నెంబర్‌వన్‌లో నిలిచింది. మరోవైపు భారత్‌.. 9 సిరీస్ లు గెలిచి, 4 ఓటములు, 1 డ్రాతో  68.3 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక రెండు, మూడు స్థానాల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ గెలవకుండా టీమిండియా అడ్డుకోవాలి. దీంతో పాటు టీమిండియాసిరీస్ను 2-1 లేదా 3-1తో గెలవాలి. అలా జరిగితేనే భారత్‌ ఫైనల్‌ చేరుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆట మధ్యలో అర్జెంట్ గా టాయిలెట్‌… అనుమతి ఇవ్వని అంపైర్.. అతగాడు ఏంచేసాడో తెలుసా..