Viral Video: వాట్ ఏ క్యాచ్.. ముచ్చటగా మూడో ప్రయత్నంలో.. బౌండరీ లైన్‌లో కళ్లుచెదిరే ఫీల్డింగ్.. వైరల్ వీడియో

|

Jun 30, 2023 | 12:45 PM

World Cup Qualifiers 2023: ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ప్లేయర్ ల్యూక్ జోంగ్వే ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి, ఆశ్చర్యపరిచాడు. మొత్తంగా తన మూడో ప్రయత్నంలో కళ్లు చెదిరే క్యాచ్ పట్టి, ప్రత్యర్ధి టీంకు షాక్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పంచుకుంది.

Viral Video: వాట్ ఏ క్యాచ్.. ముచ్చటగా మూడో ప్రయత్నంలో.. బౌండరీ లైన్‌లో కళ్లుచెదిరే ఫీల్డింగ్.. వైరల్ వీడియో
Catch By Luke Jongwe
Follow us on

Luke Jongwe’s Viral Video: ప్రస్తుతం ప్రపంచ కప్ 2023లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందుకోసం సూపర్-6 దశలో 6 జట్లు పోరాడుతున్నాయి. ఈ క్రమంలో తొలి మ్యాచ్ జింబాబ్వే వర్సెస్ ఒమన్ మధ్య జరిగింది. ఉత్కంఠగా మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు 14 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ప్లేయర్ ల్యూక్ జోంగ్వే ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి, ఆశ్చర్యపరిచాడు. మొత్తంగా తన మూడో ప్రయత్నంలో కళ్లు చెదిరే క్యాచ్ పట్టి, ప్రత్యర్ధి టీంకు షాక్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పంచుకుంది.

ఒమన్ బ్యాట్స్‌మెన్ కలీముల్లా బౌండరీ బాదేందుకు భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్‌పై ఉన్న లూక్ జోంగ్వే వద్దకు బంతి చేరుకుంది. జోంగ్వే మొదట బంతిని పట్టుకుని బౌండరీ లైన్‌ వద్ద టచ్ చేసినట్లే అనిపించాడు. కానీ, అప్రమతంగా వ్యవహరించి బంతిని గాలిలోకి విసిరాడు. ఆ తర్వాత వెనుకకు వచ్చి మరోసారి క్యాచ్ అందుకున్నాడు. కానీ, పట్టుకోల్పేయో దశలో మరోసారి బంతిని గాల్లోకి విసిరి, బౌండరీ దాటాడు. మూడో ప్రయత్నంలో మైదానంలోకి ప్రవేశించి, ఎటువంటి బ్యాలెన్స్ కోల్పోకుండా బంతినికి ఒడిసి పట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

“వాట్ ఎ క్యాచ్ బై ల్యూక్ జోంగ్వే!” అనే క్యాప్షన్‌తో ఐసీసీ వీడియో షేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌ తొలి బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. జింబాబ్వే తరపున రిచర్డ్ న్గర్వా బౌలింగ్ చేశాడు.

మ్యాచ్ పరిస్థితి..

టాస్ గెలిచిన తర్వాత ఒమన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. జట్టు తరపున సీన్ విలియమ్స్ 103 బంతుల్లో 142 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదేశాడు.

పరుగుల ఛేదనకు వచ్చిన ఒమన్‌ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 318 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కశ్యప్‌ ప్రజాపతి 97 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 103 పరుగులతో ఇన్నింగ్స్‌ సాధించగా, కశ్యప్‌ సెంచరీ ఇన్నింగ్స్‌ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..