అసలే వరల్డ్ కప్.. అందులోనూ పాకిస్తాన్‌తో మ్యాచ్.. అది కూడా నరేంద్రమోడీ స్టేడియంలో.. ఇంతకన్నా హైప్ ఇంకేం కావాలి. ఈరోజు జరిగే ఈ మెగా మ్యాచ్‌కి.. పర్ఫెక్ట్ వెదర్ సెట్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో.. చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. దీనికి రెండు టీమ్స్ ఇప్పటికే రెడీ అయ్యాయి. చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుమీదున్నాయి. ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధిచింది. అటు పాకిస్తాన్ కూడా నెదర్లాండ్, శ్రీలంకపై ఆడిన రెండు మ్యాచ్‌లోను గెలిచింది. చెరి నాలుగు పాయింట్లతో పాయింట్ టేబుల్లో సమానంగా ఉన్నాయి. టీమిండియా అటు బ్యాటింగ్, బౌలింగ్ అద్బుతంగా రాణిస్తోంది. ఇప్పటికే కోహ్లీ, రాహుల్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీతో రోహిత్ కూడా లైన్‌లోకి వచ్చాడు. అతడిలో మునుపటి ఫామ్ కనిపిస్తోంది. ఇక జ్వరం నుంచి కోలుకున్న గిల్ అహ్మదాబాద్ స్టేడియంలో ప్యాక్టీస్ చేశాడు. 99శాతం అతడు టీమ్‌లో ఉండొచ్చని రోహిత్ చెబుతున్నాడు. గిల్ వస్తే.. ఇషాన్‌ను పక్కనబెట్టే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఇంకా ఇంపాక్ట్ చూపించలేదు. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్ ఉంటారు.. స్పిన్ పిచ్ అయితే అశ్విన్ కూడా బరిలో ఉంటాడు. లేకుంటే షమీ టీమ్‌లోకి రావొచ్చు. పాండ్యా, జడేజా ఆల్‌రౌండ్ బాధ్యతలు చూస్తారు. ఇక బ్యాటర్లను బోల్తాకొట్టించే కుల్దీప్ ఉండనే ఉన్నాడు.
ఇక పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బాబర్ కూడా రాణిస్తున్నాడు. సౌద్ షకీల్, అబ్దుల్లా కూడా ధాటిగా ఆడుతున్నారు. బౌలింగ్‌లో హారిస్ రౌఫ్, షహీన్ అఫ్రీది నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురవనుంది. వీరిని మనోళ్లు ఎలా ఎదుర్కుంటారో చూడాలి. అయితే ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాక్ మధ్య ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగినప్పటికీ.. ఆధిపత్యం మాత్రం భారత్‌దే. 1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. ఈ ఏడుసార్లూ దాయాదిపై భారత్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి.. జయకేతనం ఎగరేసింది. భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించడం వల్ల పాక్‌పై ఒత్తిడి కొనసాగుతుంది. దీంతో ఈరోజు జరిగే దాయాదుల పోరుపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈనెల 5తేదీన వన్డే వరల్‌కప్ ప్రారంభమైనప్పటికి.. గ్రాండ్ సెలబ్రేషన్స్ జరగలేదు. వాటిని ఈరోజుకు వాయిదా వేసింది. నేడు అహ్మదాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్‌కి ప్లాన్ చేసింది బీసీసీఐ. మ్యాచ్‌కి అభిమానులు భారీగా వస్తుండడంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సింగర్లు అర్జిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్విందర్ సింగ్‌తో ప్రత్యేక ప్రదర్శనలను సిద్ధం చేసింది. ఈ యాక్టివిటీస్ 12.30 గంటలకు మొదలవుతాయి. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చే అవకాశముంది. వన్డే ప్రపంచకప్ లో అహ్మదాబాద్ వేదికగా ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో సెకెండ్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అలవోకగా నెగ్గింది. ఇక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం కొత్త పిచ్ ను వాడనున్నారు. పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా తయారు చేసినట్లు తెలుస్తుంది. పిచ్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించదని అంచనా వేస్తు్న్నారు. రికార్డు ఇలా ఉన్నప్పటికీ.. అయితే దాయాదుల సమరంలో ప్రెజర్ తీసుకోకుండా ఉండేందుకు టాస్ నెగ్గిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమ్మీ, రవిచంద్రన్ అశ్విన్. , ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ముహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, సౌద్ షకీల్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ముహమ్మద్ నవాజ్, ముహమ్మద్ వసీం జూనియర్, అఘా సల్మాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఒసామా మీర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..