World Biggest Bat: నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతి కి మారే ఆధిపత్య పోరు. మరి కొన్ని గంటల్లో భారత్- పాక్ మధ్య జరిగే మ్యాచ్ యుద్ధం కోసం క్రికెట్ ప్రేమికులతో పాటు, యావత్ భారత్ ఎదురు చూస్తుంది. ఆ సమరాన్ని వీక్షించడానికి గల్లీ పొరగాడు నుంచి ఢిల్లీ ఆటగాడి వరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్తాన్ ఒడిపోవాలని కాదు.. ఇండియా గెలవాలని కోరుకుంటున్నామంటున్నారు అభిమానులు.
2021 టి20 ప్రపంచ కప్ ఇండియా టీం గెలవాలని యావత్ దేశం కోరుకుంటుంది. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ తో పాటు.. క్రికెట్ ప్రేమికులంతా ఈ టి20 యుద్ధంలో ఇండియా.. కప్ తో రావాలని ఆకాంక్షిస్తున్నారు. భారత్ – పాక్ టీ20 మ్యాచ్‌ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ నడి బొడ్డున 56 అడుగుల వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ బ్యాటు ఆవిష్కరించారు. గో ఫర్ కప్ అంటూ క్రికెట్ లవర్స్ టీమ్ ఇండియాకి అల్ ది బెస్ట్ చెప్తోంది. కాగా ఈ లార్జెస్ట్ బ్యాట్‌ని పెర్నోడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ రూపొందించగా.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఈ బ్యాట్‌ను సదరు సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ బ్యాట్‌ను ట్యాంక్ బండ్ రోడ్డులో క్రికెట్ అభిమానుల వీక్షణ కోసం ఉంచారు.
Also read:
Visakhapatnam: భారతీయ యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం.. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలు..